
అమరావతి: సెప్టెంబర్ 4. ప్రకృతి సమతుల్యతను జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి చెట్లు ఎంతో ఉపయోగపడతాయని ఆంధ్ర ప్రదేశ్ దేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ప్రధాన ముఖ్య అటవీ సంరక్షకులు మరియు సభ్య కార్యదర్శి డాక్టర్ డి. నళినీమోహన్ అన్నారు. గుంటూరు జిల్లా మండల కేంద్రమైన అమరావతిలో ఏపీ జీవ వైవిధ్య మండలి సౌజన్యముతో జన చైతన్య సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి ఔషధమొక్కల కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ నళినీమోహన్ మాట్లాడుతూ రోగ నిరోధక శక్తికి పెంచడానికి ఆరోగ్యానికి మంచి ఆక్సిజనీ పెంపొందించడానికి ఈ ఔషధ మొక్కలు ఎంతోగానో దోహదపడతాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉసిరి, నేరేడు, జామ, కరివేపాకు, దానిమ్మ, మారేడు, వేప, నిమ్మ, చెట్ల జాతుల మొక్కలు మూలిక జాతి మొక్కలైన తులసి, పుదీనా, కొత్తిమీర, అలీ వీర తదితర మొక్కలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఔషధ మొక్కలను జాగ్రత్తగా పెంచితే కుటుంబమంతాఎంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో ఉపయోగపడతాయని, అంతరించిపోతున్న క్రిమికీటకాలు పక్షులు, జంతువులను కాపాడు కోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఏపీ జీవ వైవిధ్య మండలి ప్రాంతీయ జీవ వైవిధ్య సమన్వయకర్త డాక్టర్ ఎల్ వరలక్ష్మి మాట్లాడుతూ జీవవైవిధ్య కమిటీల ద్వారా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఆరోగ్యవంతమైన సమాజం కోసం పక్షి జాతులు అంతరించి పోకుండా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జున రావు, ఎంపీడీవో శ్రీనివాస రావు, గ్రామ సర్పంచ్ రాజేశ్వరి, ఉపసర్పంచ్ నిమ్మ విజయ సాగర్ బాబు, పంచాయతీ కార్యదర్శి మోహన్ చంద్, జన చైతన్య సమితి కోఆర్డినేటర్ వెలితోటి అనిల్ కుమార్, ప్రతినిధులు గొట్టేం చంద్ర, షేక్ జుబెద, బొంత తంబి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొక్కలు పంపిణీ చేసి రోడ్డు పక్కన మొక్కలు నాటారు.
అటవీ సంరక్షకులు మరియు సభ్య కార్యదర్శి డాక్టర్ నళినీమోహన్2. మొక్కలు పంపిణీ చేస్తున్న ఏపీ జీవ జీవ వైవిద్య మండలి ప్రధాన ముఖ్య అటవీ సంరక్షకులు మరియు సభ్య కార్యదర్శి డాక్టర్ నళినీ మోహన్ తదితరులు3. మొక్కలు నాటుతున్న ఏపీ జీవ వైవిద్య మండలి ప్రధాన ముఖ్య అటవీ సంరక్షకులు మరియు సభ్య కార్యదర్శి డాక్టర్ మురళీ మోహన్ , ప్రాంతీయ జీవవైవిధ్య సమన్వయకర్త వరలక్ష్మీ తదితరులు
ప్రకృతి సమతుల్యతను జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి చెట్లు ఎంతో ఉపయోగపడతాయి.. డాక్టర్ నళిని మోహన్అమరావతి,

