అమ్మకానికి ఆంధ్రప్రదేశ్…

0
293

విద్య, వైద్యం, వ్యాపార మైతే ప్రజలకు తీరని నష్టం…

ఇప్పుడు ఇండిగో… మెడికల్ కాలేజీలు సొమ్ము సర్కార్ ది…సోకు ప్రైవేట్ వ్యక్తులది.. పేదలకు వైద్యం.. వైద్య విద్య దూరం చేయడమే.. పీపీపీ విధానం

నేడో.. రేపో.. సాగునీరు పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగింత త్వరలో అన్ని స్థాయిలు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటీకరణ తథ్యం ఇండిగో వ్యవహారంతో… కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వైఫల్యం బయటపడింది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆపేదాక పోరాటం కొనసాగిస్తాం.

నవతరం, పలాస: కోటి సంతకాల సేకరణ విజయవంతం 50వేల సంతకాల సేకరణ పత్రాలను జిల్లా కేంద్రానికి తరలించే వాహనానికి జెండా ఊపిన రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్ఆర్సిపి డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీదిరి అప్పలరాజు (పలాస) కూటమి ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కంటే చాలా వేగంగా అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే పథకం శరవేగంతో అమలు చేసే భాగంలో ప్రభుత్వం భాగస్వామ్యం కలిగిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కంకణం కొట్టుకుని పని చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సిదిరి అప్పలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పలాసలోని వైయస్సార్సీపి కేంద్ర కార్యాలయమైన ప్రగతి భవన్ వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి అధిష్టానం పిలుపుమేర కోటి సంతకాల సేకరణ పత్రాలను జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయానికి వాహనంతో తరలించే కార్యక్రమానికి డాక్టర్ అప్పలరాజు హాజరై జెండా ఊపారు. ఈ సందర్భంగా పలాస నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన వైఎస్ఆర్సిపి శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం వ్యాపార మైతే పేద, మధ్యతరగతి ప్రజలకు తీరని నష్టమని,ప్రభుత్వ సొమ్ముతో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమే పీపీపీ విధానమని, ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెట్టేందుకు పథకం రూపొందించినట్లు డాక్టర్ అప్పలరాజు ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వరకు రాష్ట్రంలో 12 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవన్నారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి తీసుకువచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేద విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలను, అలాగే పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఆశయంతో వైయస్ జగన్ ఆనాడు 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. అందులో భాగంగా కొన్ని కళాశాలలు పూర్తికాగా, మరికొన్ని వివిధ దశలో ఉన్నాయన్నారు. ఆ కళాశాలలకు కేవలం రూ. 8000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించలేదా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇదివరకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, అయితే తన హయంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కళాశాలను అయినా రాష్ట్రానికి మంజూరు చేయించారా? అని డాక్టర్ అప్పలరాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని, వారి బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్య కళాశాలలను బహుమతిగా ఇచ్చారని, వాటిని చంద్రబాబు తమ సొత్తు అన్నట్లుగా అస్మదీయులకు దానం చేస్తున్నాడని మండిపడ్డారు. వైయస్ జగన్ ప్రజలు ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా, పేద తల్లుల పిల్లలు డాక్టర్లుగా ఎదిగేందుకు రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించడమే కాక, కరోనా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూనే రాష్ట్రంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయించగలిగారని, అందులో మూడు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయని, మరో రెండు కళాశాలలు ఎన్నికల కోడ్ వలన ప్రారంభించలేకపోయారని, మిగిలిన పది కళాశాలలు వివిధ స్థాయిల్లో పురోభివృద్ధిలో ఉన్నాయన్నారు. ఆయా మెడికల్ కాలేజీలలో ఏటా దాదాపు 200, 250 మంది పేద విద్యార్థులు వైద్యులుగా ఎదిగి రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి బృహత్తర ఆలోచన చేశారని అన్నారు. అటువంటి పరిస్థితులను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కాలేజీలకు మంజూరైన మెడికల్ సీట్లను తమకు వద్దని వెనక్కి పంపించారన్నారు. ఆ కాలేజీల్లో వైద్యులుగా ఎదగవలసిన 5000 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని డాక్టర్ అప్పలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇండిగో విమానాల రద్దు వ్యవహారం వల్లే రేపు వైద్య కళాశాలలు ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని, ఇండిగో విమానాల రద్దు వ్యవహారం దీనికి నిదర్శనం అన్నారు.పీపీపీ విధానం ద్వారా పేదవాడికి వైద్యo, పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేయడమేనని దుయ్యబట్టారు. ఈ వేళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాక రేపో మాపో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు మొత్తం ప్రైవేటీకరించబడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కూడా మోసగించే ప్రక్రియలో భాగంగా సాగునీటి వనరులు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం జరుగుతుందని, అన్నదాతలు ప్రైవేట్ వ్యక్తులు దగ్గర నుంచి నీరు అడుక్కునే పరిస్థితి దాపురించడం ఖాయమన్నారు. ఇండిగో విమానాల రద్దు వ్యవహారంలో ఆ శాఖ పౌర విమానాల శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్పొరేట్ శక్తులకు ఎలా లొంగిపోయి.. వ్యవహరించిన ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నేపాల్ దేశంలో సంక్షోభం సంభవించినప్పుడు అక్కడి భారతీయ పౌరులను మన దేశానికి విమానాల ద్వారా తరలించినప్పుడు చంద్రబాబు తన ఖాతాలో ఆ క్రెడిట్ వేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఇండిగో విమానాల రద్దు విషయంలో ఆ వైఫల్యాలను కూడా చంద్రబాబు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎందుకు వేసుకోరని డాక్టర్ అప్పలరాజు విమర్శించారు. సీఎం చంద్రబాబు ఎన్నికలలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు కంటే కేవలం సప్రయోజనాల కోసమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, రేపో మాపో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సత్య ప్రసాద్ ను బలి పశువును చేసి బిజెపి వైఫల్యం అంటూ నింద వేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ” రచ్చబండ” పేరుతో గ్రామ గ్రామాన వైయస్సార్సీపీ శ్రేణులతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ పలాస నియోజకవర్గంలో యజ్ఞంలో కొనసాగిందని, ఉప్పెన లా సాగిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్యంగా స్పందన లభించిందని, త్వరలో కోటి సంతకాల పత్రులను రాష్ట్ర గవర్నర్ కి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందజేయడం జరుగుతుందని డాక్టర్ అప్పలరాజు స్పష్టం చేశారు. అనంతరం 50వేల సంతకాలతో కూడిన పత్రులను ఒక ప్రత్యేక వాహనంపై వైఎస్ఆర్సిపి జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలించే క్రమంలో డాక్టర్ అప్పలరాజు జండా ఊపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నేత హనుమంతు వెంకట్రావు దొర, జడ్పీ వైస్ చైర్ పర్సన్ ప్రతినిధి పాలిన శ్రావణి శ్రీనివాస్, పలాస ఎంపీపీ ప్రతినిధి ఉంగసాయి కృష్ణ యాదవ్, వైఎస్ఆర్సిపి పలాస పట్టణ అధ్యక్షులు శిష్టు గోపి, వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు పైల చిట్టిబాబు, మందస ఎంపీపీ డొక్కరి దానయ్య యాదవ్, వజ్రపు కొత్తూరు ఎంపీపీ ప్రతినిధి ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి అగ్గున సూర్యారావు, బాలిగాం పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు సొర్ర ఢిల్లేశ్వర్ రావు, వైఎస్ఆర్సిపి సీనియర్ నేత దుంపల లింగరాజు, పలాస పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు చింతాడ మాధవరావు, వైయస్సార్ ఉద్యాన వర్సిటీ పాలకమండలి మాజీ సభ్యులు బత్తిన లక్ష్మణ్, కౌన్సిలర్లు బెల్లాల శ్రీనివాస్, పిచ్చుకల అజయ్, సవర సోమేశు, దున్న నిర్మల సత్యం, వైఎస్ఆర్సిపి నేతలు తూముల సోమేశ్, మొదలవలస మన్మధరావు, గుజ్జు జోగారావు, తిరునగరి సవరయ్య మాస్టర్, చెరుకుపల్లి లక్ష్మణరావు, దల్లి జానకి రెడ్డి, సవర నీలకంఠం, బత్తిన లక్ష్మీనారాయణ, గుసిరి వెంకట్రావు యాదవ్, జుత్తు శంకర్, బగాధి హరికృష్ణ, కిర్రి రాజారావు, బత్తిన హేమేశ్వరరావు, బమ్మిడి ధర్మారావు, నర్తు వెంకటరమణ యాదవ్, మద్దిలి హరి నారాయణ యాదవ్, కొర్రాయి గోపి, దువ్వాడ రవి, పందిరి బైరాగి, బమ్మిడి సంతోష్, సురేష్ పాణిగ్రహి, నాగేశ్వర బృందావన్, బత్తిన కుమారి, సార దూర్వాసులు, సార హరికృష్ణ, యాళ్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here