
అమలాపురం పార్లమెంటు అధ్యక్షరాలు రెడ్డి అనంతకుమారి…
నవతరం, కొత్తపేట: ఇటీవల కురిసిన అధిక వర్షాలకు చేతికందొచ్చిన పంటంతా నాశనమై రైతులు దీనావస్థలో ఉన్నారని వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ రెడ్డి ఆనంతకుమారి విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన పంట నాశనమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆమె ఆరోపించారు. రైతు దేశానికి వెన్నుముక లాంటి వారని, అటువంటి రైతు కన్నీరు పెట్టడం మంచిది కాదని రెడ్డి అనంతకుమారి అగ్రహం వ్యక్తం చేసారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమలాపురం రూరల్ మండలం నడిపూడి గ్రామంలో అమలాపురం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ అయితా బత్తుల ఆనంద రావుఆధ్వర్యంలో వర్షాల వల్ల పాడైన పంటలను అమె టిడిపి నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్డి అనంత కుమారి, అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనంద రావు లు మాట్లాడుతూ రైతులు ఎకరానికి 25 నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వర్షాల వల్ల పంటంతా నాశనమై చాలా కష్టాల్లో ఉన్నారన్నారు. రైతుల బాధ చూడలేక పోతున్నామన్నారు. అధికారంలో ఉన్న మంత్రి గానీ అధికారులు గానీ రైతుల వద్దకు వచ్చి పంటల పరిశీలించలేదని కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారని వారు విమర్శించారు. తిరిగి రైతు మళ్ళీ పంట పండించాలంటే పెట్టుబడి పెట్టె పరిస్థితుల్లో రైతులు లేరని వారన్నారు. తక్షణమే విత్తనాలు, పెట్టుబడులు సమకూర్చాలని ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అమలాపురం రైతు అధ్యక్షులు మట్ట ప్రభాకరరావు, పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ ఎంపిపి ఎలుబండి వెంకటేశ్వరరావు, అధికారి జయ వెంకట లక్ష్మీ బాబ్జి, వేగిరాజు వెంకటరాజు, కాకిలేటి సూరిబాబు, మల్లుల పోలయ్య ,దెంతుకూరి సత్తిబాబు రాజు, రాజులపూడి భీముడు ,బడుగు సత్యనారాయణ, మంథా గెద్దయ్య, నడింపల్లి ఉదయబాబు, గోలకోటి చిన్న తదిరలు పాల్గొన్నారు. నవతరం, కొత్తపేట. భోగిశెట్టి నాగేశ్వరరావు.

