
శాంతి కాలనీలో అన్నదానం చేస్తున్న జన చైతన్య సమితి కార్యదర్శి సాంభశివరావు…

ఫంక్షన్లో మిగిలిన ఆహారాన్ని పేదలకు పంపిణీ చేస్తున్న సాంబశివరావు, నాగేశ్వరరావు తదితరులు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయవద్దు…
నవతరం, పెదకూరపాడు: డిసెంబర్ 20, అన్నం పరబ్రహ్మ స్వరూపమని వృధా చేయవద్దని,ఆకలి లేని సమాజమే లక్ష్యంగా అన్నార్తులను ఆదుకోవాలని, జన చైతన్య సమితి(జె సి ఎస్) స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి తుళ్లూరి సాంబశివరావు అన్నారు. పల్నాడు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడుకు చెందిన బోరుగడ్డ కళ్యాణి ఇంటి వద్ద జరిగిన కార్యక్రమంలో భోజనం మిగిలినట్లు పమిడిపల్లి శ్రీనివాసరావు జన చైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ టీమ్ కు తెలిపారు.మిగిలిన భోజనాన్ని సేకరించి పెదకూరపాడు మండలంలోని 75 తాళ్లురు శాంతి కాలనీలో శనివారం జె సి ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పంపిణీ చేశారు.ఈసందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఆహార వృధా చేయవద్దని మిగిలి ఉంటే సమాచారం ఇవ్వండని అన్నారు. కార్యక్రమంలో జెసిఎస్ సంస్థ ప్రతినిధులు బెజ్జం నాగేశ్వరరావు,దాసరి విజయ్ బెన్నిబాబు,కాలనీ పెద్దలు కిన్నెర అంజయ్య, గంధం వీర్లంక తదితరులు ఉన్నారు

