హైటెక్ దోపిడీని చూసి .. ఆశ్చర్యపోయిన హైకోర్టు..!

0
127


రహేజా కార్స్ కు 99 పైసలకే 27.10 ఎకరాల భూకేటాయింపులపై హైకోర్టు విస్మయం..!

నవతరం, విజయవాడ: ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇచ్చే స్తారా….!..
దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా….,!..
ఇంత తక్కువ ధరకు భూములిస్తే.. మిగిలిన కంపెనీలు ముందుకు రాలేదా?
వస్తే ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి?
అన్నింటికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకి భూ కేటాయింపులు ఏమిటి?.. ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బెంచ్ ప్రశ్నల వర్షం..!
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
విశాఖపట్నంలో మధురవాడ, ఐటీ హిల్ లో కేవలం 99 పైసలకే 27.10 ఎకరాల భూమిని రహేజాకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు, మానవ హక్కుల కమిషన్ పూర్వ సభ్యుడు డాక్టర్ జీ . శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయగా …
పిటి షనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు
ప్రభుత్వం భూ కేటాయింపులతో సరిపెట్టలేదని, ప్రోత్సాహకాలుగా సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎదురు రూ.91.2 కోట్లు చెల్లిస్తోందని.. అందువల్ల తగిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
పొన్నవోలు లేవనెత్తిన పాయింట్ సరైనదేనని గౌరవ ధర్మాసనం భావిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది
ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత అన్ని విషయాలను పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
కాగా… కూటమి ప్రభుత్వం 99 పైసలకే భూ కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి
టీసీఎస్ 21.60 ఎకరాలు
కాగ్నిజెంట్ 22.19 ఎకరాలు
సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్..3.55 ఎకరాలు
ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్..10.29 ఎకరాలు
రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్..27.10 ఎకరాలు…..!..
వైయస్ జగన్ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం సెంటు స్థలం ఇస్తే “దోపిడీ అంటూ, ఏపీ శ్రీలంక అయి పోతుందంటూ” గుండెలు బాదుకున్న కొందరు మేధావులు……!.. ఇప్పుడు బాబు ప్రభుత్వం బడా బాబులకు విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద పెద్ద నగరాల నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ధారా ధత్తము……!.. ప్రజాస్వామ్య భారతదేశంలో గూడు కట్టుకునేందుకు సెంటు భూమి ఇస్తే అది దోపిడీ అంటా…..!… బడా బాబులకు లక్షల కోట్లు విలువైన భూములను వేల కోట్లలో అప్పనముగా కట్టబెడితే అది ప్రజాస్వామ్యం…….!.. నేటి పాలకుల తీరు తెన్నెలు ఎలా ఉన్నాయి……!.. బహుశా సంపద సృష్టి అంటే ఈ విధముగా ఉంటుందేమో…..!.. సామాన్యులకు పాపం తెలియదుగా…..!..
ఎటువంటి టెండర్లు పిలవకుండా.. అక్రమంగా క్విడ్ ప్రోకో పద్ధతిలో ఊరు పేరు లేని డొల్ల కంపెనీలకు కేవలం 99 పైసలకు దోచిపెడుతుంటే… ఎందుకు నోరు ఎత్తలేకపోతున్నారు..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here