నవతరం, ఇచ్చాపురం: ఇచ్చాపురం నియోజకవర్గాన్ని సంస్కరించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం మెజారిటీ వర్గాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కు కొలబద్ద ఈనియామకం…..!.. సామాజిక సమతుల్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఆచరించి సరైన నిర్ణయాన్ని సకాలంలో తీసుకొని ఇచ్చాపురం నియోజకవర్గం దీర్ఘకాల సమస్యను సున్నితంగా సమతుల్యతను పాటించి పరిష్కరించిన పార్టీ అధ్యక్షులు. అదేవిధంగా సీనియర్ నేత వాగ్ధాటి కలిగి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మేధావి వర్గానికి చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి పార్లమెంట్ నియోజకవర్గానికి అధ్యక్షులుగా కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం పార్టీ వర్గాలలో సంతృప్తిని ఆనందాన్ని కలిగించిందని మీ నిర్ణయం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితులను అవగాహన చేసుకుని ఆచరిస్తున్నారు అనే విధానం అర్థం అవుతుందని ఈ సందర్భముగా వైయస్సార్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధన్యవాదములు తెలియజేయవలసిన అవసరం ఉందని పార్టీ నేతలు కొందరు కొనియాడారు. ఈసమతుల్యత పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని సీనియర్ వైసీపీ నాయకులు పలువురు ఒక ప్రకటనలు తెలియజేశారు.
యాదవులకు ఎమ్మెల్సీ, కాళింగలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్, నియోజకవర్గంకో ఆర్డినేటర్ గా రెడ్డిక సామాజిక వర్గానికి కేటాయిస్తూ సామజిక సమతూకాన్ని పాటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో ఉత్తర శ్రీకాకుళంలో అస్తవ్యస్త పార్టీ పరిస్థితులను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకొని ఏకపక్షంగా కాకుండా పార్టీ ప్రతిష్టతకు సమర్థులు ఎవరు వారి వారి ప్రజా బలములు ఏమిటి అన్నది తెలుసుకొని సంబంధిత నియోజకవర్గలపై దృష్టి సారించితే భవిష్యత్తులో మంచి పరిణామాలు చోటు చేసుకునేందుకు దోహదపడుతుందని అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధినేత దీనిపై దృష్టి సారించి సముషితమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని క్షేత్రస్థాయిలోని ప్రజలు పార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆశిద్దాం వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటారని. ఈ జిల్లాలో పార్టీ అభిమానులు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. సమర్ధుడైన పిరియా సాయిరాజ్ ని సి.ఈ.సి సభ్యునిగా నియమకం పొందినందుకు శుభాకాంక్షలు. అనుభవజ్ఞుడైన సీతారాంకి పార్లమెంట్ సమన్వకర్తగా కొనసాగించి నందుకు శుభాకాంక్షలు శ్యాంప్రసాద్ రెడ్డి, సాయిరాజ్, తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ లను నియమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు అని ఒక ప్రకటనలో ఈ సందర్భంగా నర్త నరేంద్రయాదవ్ మరియు సీనియర్ నాయకులు పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు, అధినేతకు ధన్యవాదములు పత్రికల ద్వారా తెలియజేశారు.