
పెమ్మసాని సార్…..!.. ఒక్కొక్కటిగా నేడు తేలిపోతున్నాయి..
ప్రజలు మంచి ఏంటనేది ఆలోచిస్తున్నారు.. ఆలోచిస్తారు…..!.. మంత్రిగారు….!..
నవతరం, విజయవాడ: నిజంగా జగన్ చేసిన చట్టం తప్పే అయితే అదే చట్టంలో భాగమైన ల్యాండ్ రీ సర్వే మీరెందుకు కొనసాగిస్తున్నారు పెమ్మసాని సార్….!.. జగన్ బొమ్మను మాత్రమే తప్పుబట్టేదుస్థితి తప్ప మీకు జగన్ చేసిన రీ సర్వే కి కేంద్రం నుండి వచ్చిన ప్రోత్సాహకాలు మీరెందుకు తీసుకున్నారు….?..
గ్రీవెన్స్ లు క్లియర్ చేసి మీరు 500 కోట్లు తెచ్చారా.? అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దు ఉండాలి..మీరు గ్రీవెన్స్ లు క్లియర్ చేసి ఉంటే మొన్న మీరిచ్చిన కొత్త పాస్ పుస్తకాల్లో ఉన్న తప్పులకు మీ సీఎం చంద్రబాబు అసహనంతో మళ్ళీ ఎందుకు ఇవ్వమంటున్నారు పెమ్మసాని సారూ….!.. నిజంగా బిల్లు తప్పు అయితే అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ బిల్ పెట్టేటప్పుడు అప్పటి పీఏసీ చైర్మన్ మీ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దీన్ని ఎందుకు స్వాగతించారు పెమ్మసాని…..!..
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొచ్చిచదివేస్తే సరిపోదు సార్.. కొంచెం వెనుక ముందు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడండి పెమ్మసాని సారూ…!.. ఇది ప్రజా సౌమ్య ప్రభుత్వము ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం అందుకు మీరు ఆ ప్రభుత్వములో ఒక మంత్రిగా బాధ్యతాయుతమైన పాత్రలో ఉన్న మీరు కేవలం మీకు నచ్చిన విషయాలను మీ క్రెడిట్ కోసం చెప్తే సరిపోదు, రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఉంటారు. మీరు చదివే స్క్రిప్టులోను వాస్తవాలను కూడా పరిశీలన చేయవలసి ఉంది. అది ఒక ప్రజా ప్రభుత్వ బాధ్యత కలిగిన మంత్రిగా దానిని గుర్తించండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పే అయితే నేడు జరుగుతున్నది మీరు పెట్టిన పేరు రీసర్వే మొదట నుండి జరుపుతున్నారా? కేవలం గత ప్రభుత్వము చేసిన సర్వేలో పాసుపుస్తకాల లోనూ నున్న ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒకటి మాత్రం మీకు ప్రచారానికి వజ్రాయుధముగా ఉపయోగపడింది అన్నది నిజం అయితే దానికి 100 రెట్లు జోడించి మీరు దానిపై దుష్ప్రచారం చేసి లబ్ధి పొంది చివరకు ఆ సర్వే ద్వారా వచ్చిన పారితోషకమే నేడు మీకు వచ్చిన డబ్బు అన్నది మీరు గుర్తించిన గుర్తించకపోయిన అది అక్షరాల నిజం వాస్తవం. దానిని మీరు సాధించింది కాదన్నది మీరు నమ్మినా నమ్మకపోయినా గణాంకాలు ప్రజలు నమ్ముతారు అన్నది గుర్తించవలసిన ఆవశ్యకత ఉంది. ఈనైపద్యంలో నేటి పరిపాలన కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆ ప్రభుత్వ కార్యక్రమాలనే పేర్లు మార్చి కొనసాగిస్తున్నట్లు రూడి అగుచున్నది. అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్న తరుణంలో ప్రజాస్వామ్యవాదులు వ్యక్తం చేస్తున్న విషయములు. నేటి ప్రజా ప్రభుత్వం భవిష్యత్తులోనైనా వాస్తవాలను ప్రజలకు అందిస్తుందని ఇచ్చిన హామీలను అక్షరాల నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని కులమత రాజకీయాలకు అతీతంగా పరిపాలన అందిస్తారని ఆశిద్దాం.

