
ఆంధ్రా, తెలంగాణలలో పనిచేస్తున్న హోంగార్డ్స్ కి న్యాయం చేయండి సార్……!…
గత 11 సంవత్సరముల క్రితమే సమైక్యాంధ్ర విడపోవడంతో నేటికీ కూడా విభజన హామీలలో భాగంగా మాకు స్వరాష్ట్రాలకు నేటికీ పంపలేదు….!…
నవతరం: (ఆంధ్రా, తెలంగాణ): పూర్తి బాధ్యతలు పోలీసు శాఖలో నిర్వర్తిస్తూ చాలీచాలని వేతనాలతో జీవితాలను వెల్లబుస్తున్న మాకున్యాయం చేయండి…..!… స్వాతంత్రానికి పూర్వము నుండి ఆనాడు స్వచ్ఛంద వ్యవస్థగా ఏర్పడి తదనంతరం వివిధ రకాలగా రూపాంతరం చెంది కొన్ని దశాబ్దాలుగా బాధ్యతగా క్రమశిక్షణతో పోలీస్ శాఖతో దీటుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాకు ఉద్యోగ భద్రత కనీస వేతనాలు నేటికీ లేకపోయిన…….!… బాధ్యతగల వృత్తిలో ఉన్న మాకు కనీసం విభజన చట్టంలోని ఇతర శాఖల ఉద్యోగులు వలె మాకు కూడా స్వరాష్ట్రాలకు బదిలీ చేసి మానవీయ కోణంలోనైనా మాకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు మరియు మా బిడ్డలకు విద్య కోసం స్వరాష్ట్రాలలో అభ్యసిస్తే తప్ప స్థానికత కోల్పోయి దాని వలన వారి భవిష్యత్తు కూడా మారిపోతుంది. కనుక ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని తక్షణమే న్యాయం చేయండి. ** ముఖ్యముగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది హోంగార్డ్స్ పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినందున అందులో ఏర్పడిన ఖాళీలలో తెలంగాణలో ఉన్న హోంగార్డ్స్ ని సర్దుబాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు అదే విధంగా సుదీర్ఘ కాలముగా హోంగార్డ్స్ రిక్రూట్మెంట్ లేక ఎందరో నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. హోంగార్డ్స్ బడ్జెట్ ఇతర రాయితీలు తదితర అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించక పోవడం వలన వారు మరీ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఏదిఏమైనప్పటికీ నేటి కాలమాన పరిస్థితులు మారుతున్న ప్రజా జీవనములు పోలీస్ పాత్ర అత్యంత ముఖ్యమైనదిగా చెప్పవలసి ఉంది. పెరిగిన జనాభాకు అనుగుణముగా పోలీసు వ్యవస్థను లేదా కనీసం హోంగార్డు వ్యవస్థను అయినా పూర్తిస్థాయిలో రూపకల్పన చేసి ప్రజలకు మెరుగైన రక్షణ మరియు పరిపాలన వ్యవహారాలలో పూర్తిస్థాయిలో అందుబాటు సంఖ్యలో ప్రభుత్వాలు నియమించవలసి ఉంది. అదిశగా పాలకపక్షాలు దృష్టిసారించి నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు ప్రజల ప్రశాంత జీవనానికి పోలీసు వ్యవస్థ దోహదపడే విధముగా ఏర్పాట్లు చేయాలని తద్వారా అసంఘటిత శక్తులకు అవకాశం కల్పించకుండా ఉండేందుకు పోలీస్ వ్యవస్థ/హోంగార్డ్స్ వ్యవస్థ పూర్తిస్థాయిలో దోహదపడుతుందని తెలియజేయుటకు అతిశయోక్తి లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపద్యంలో తెలంగాణలో ఉన్న హోంగార్డ్స్ ని పూర్తిగా తక్షణమే ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొని వచ్చేందుకు మరింత మార్గము సులువయ్యిందని చెప్పవచ్చు అని ఎందుకంటే ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ గా నియమితులైనటువంటి హోంగార్డ్స్ ఖాళీలను పూరించేందుకు తెలంగాణలో ఉన్న ఆంధ్రా స్థానికత కలిగిన హోంగార్డ్స్ తక్షణమే తెప్పించి ఆ ఖాళీలను సరి చేయడంతో పాటు వారికి న్యాయం చేయడం అన్నది కూడా మరింత సులువుగా జరుగుతుందని వారు తెలియజేశారు. ఆశిద్దాం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత శాఖ వారు తక్షణమే సున్నితమైన చిన్న సమస్యను పరిష్కరించేందుకు తగు చర్యలు చేపడతారని.

