



34 రోజులకు గాను హుండీ ఆదాయం 2,05,51,004 ..
నవతరం, ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం రూ.1,46,07,768 రూ లు ఆదాయంగా లభించింది, అన్న ప్రసాదం హుండీల నుంచి రూ.59,43,236 ల ఆదాయం లభించింది, మొత్తం 34 రోజులకు గాను రూ2,05,51,004లు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. నగదుతో పాటు 26 గ్రాముల బంగారం, 1kg 200 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 14 దేశాలకు చెందిన 87 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పెండ్యాల భవాని, చింతపల్లి సత్యనారాయణ, తమ్మన సాయి ప్రసాద్, సిస్ట్ల సూర్య కుటుంబరావు, మసకపల్లి త్రిమూర్తులు హాజరయ్యారు. అలాగే అర్చకస్వాములు, వేదపండితులు, గ్రామస్థులు, శ్రీవారి సేవకులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. హుండీ ఆదాయం లెక్కింపుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (లక్ష్మి పోలవరం) మరియు కెనరా బ్యాంక్ (రావులపాలెం) అధికారుల సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్) మరియు కార్యనిర్వహణాధికారి & డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు మాట్లాడుతూ, భక్తుల విశ్వాసం మరియు సహకారంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా చేపడుతున్నామని తెలిపారు.

