
వాకింగ్ తోనే ఆరోగ్యం
నవతరం, భీమవరం: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం వాకింగ్ తోనే ఆరోగ్యం ఉందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. వన్ టౌన్ లో ఎడ్వర్డ్ చెరువు చుట్టూ రూ 5 లక్షలతో నిర్మించిన వాకింగ్ ట్రాకులు శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వాకింగ్ ట్రాక్ ను రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మనిషి జీవితంలో నిత్యం తమ తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం బిజీగానే ఉంటారని, అయితే ఆరోగ్య పరిరక్షణకు ఎవరికి వారు రోజూ లో కొంత సమయం వ్యాయామానికి కేటాయించాల్సి ఉందని అన్నారు. ఇందులో ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం గాని, సాయంత్రం గాని వాకింగ్ చేయడం వల్ల శరీరంలో అన్ని అవయవాలకు రక్త ప్రసరణ సక్రమంగా సరఫరా అవుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పట్నంలో పార్కులలో వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తిరు మా ని ఏడుకొండలు, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, మున్సిపల్ ఎం ఈ ఈ శ్రీకాంత్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏ ఎస్ రాజు, మానేపల్లి నాగన్న బాబు, కోడే యుగంధర్, తోట భోగయ్య, నా మన మహేష్, గుంటి ప్రభు, మాదిరెడ్డి శ్రీనివాస్, బాబా, జంగ మాణిక్యాలరావు, ఆకుల సుబ్బులక్ష్మి, సుంకర బాబురావు ఏవీఎస్ సభాపతి, కురిసేటి కాశి, పిచ్చే టి ప్రసాద్, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మొక్కలను నాటారు.

