రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం నిజాలు చెప్పేసిన నీటిపారుదల శాఖ మంత్రి……!..

0
140


గత ప్రభుత్వ విధానాలను విమర్శించాలని వచ్చే ఉంటారు కానీపూసగొచ్చినట్లు అనుకోకుండానే నిజాలు చెప్పేశారు……!…

నవతరం, విజయవాడ: రాజకీయాల్లో ఒక్కోసారి సీన్ సితార్ అవుతుంటుంది అనడానికి మంత్రి నిమ్మల రామానాయుడు గారి తాజా ప్రెస్ మీటే పెద్ద ఉదాహరణ పాపం ఆయన ఉద్దేశం ఒక్కటే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో గత ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయాలి, నిబంధనలు పాటించలేదని చెప్పాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చారు. కానీ ఫ్లోలో ఆయన చెప్పిన మాటలు వింటే మాత్రం.. “అరె.. ఇదేదో జగన్ పనితనానికి సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఉందే” అని సామాన్యుడికి కూడా అనిపించక మానదు. ఎందుకంటే ఆయన విమర్శ సారాంశం ఒక్కటే.. “అనుమతులు లేవు, కానీ పనులు మాత్రం జెట్ స్పీడ్ లో జరిపించారు” అని. ఇది విమర్శలా ఉందా? లేక ఇండైరెక్ట్ కాంప్లిమెంట్ లా ఉందా? నిజానికి ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా.. “గత పాలకులు గాడిదలు కాశారు, తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు, అంతా గ్రాఫిక్స్” అని చెప్పడం ఆనవాయితీ. కానీ ఇక్కడ సీన్ రివర్స్. “ఎన్జీటీ వద్దంది, కేంద్రం ఆపమంది, అయినా సరే వినకుండా మొండిగా రెండు వేల కోట్ల పనులు చేశారు” అని మంత్రిగారు వాపోతున్నారు. అంటే శ్రీశైలంలో నీళ్లు అడుగంటి పోయినా సరే, ఢిల్లీ నుంచి వచ్చే పర్మిషన్ కాగితాల కంటే, సీమ రైతు కళ్లల్లో ఆనందమే ముఖ్యమని ఆనాడు జగన్ భావించారని మంత్రిగారే ఒప్పుకున్నట్లు అయ్యింది. హాల్ టికెట్ రాలేదని ప్రిన్సిపాల్ గారు తిడుతుంటే, కుర్రాడు మాత్రం గోడ దూకి వెళ్ళి మరీ ఎగ్జామ్ రాసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు ఉంది ఈ వ్యవహారం. ఇంకో తమాషా ఏంటంటే.. దాదాపు కిలోమీటర్ల కొద్దీ టన్నెల్ తవ్వేశారని, మెషినరీ తెచ్చేశారని మంత్రిగారు లెక్కలతో సహా వివరించారు. ఈ మాటలు విన్న సీమ జనం.. “ఓహో.. అయితే పేపర్ మీద సంతకాలు పెట్టడంలో లేట్ అయ్యిందేమో కానీ, గ్రౌండ్ లో పారలు మాత్రం ఆగలేదన్నమాట” అని సంబరపడిపోతున్నారు. అక్రమంగా కట్టారు అని చెప్పబోయి, అద్భుతంగా కట్టారు అనే అర్ధం వచ్చేలా మాట్లాడటం బహుశా మన తెలుగు రాజకీయాల్లోనే చూడగలం.
మొత్తానికి మంత్రిగారి విమర్శలు చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తోంది. అత్తగారు కోడలిని తిడుతూ.. “వంట గదిలో సామాన్లు సర్దలేదు కానీ, వంట మాత్రం అద్భుతంగా చేసింది” అని కంప్లైంట్ ఇచ్చినట్టుంది. రూల్స్ బుక్ పక్కన పెడితే.. పని జరిగిందా లేదా అని చూసేవాడికి మాత్రం మంత్రిగారి మాటలు జగన్ కు ఫుల్ మార్కులు వేయించేలానే ఉన్నాయి. పాపం నిమ్మల వారు వేసింది పొలిటికల్ బాంబ్ అనుకున్నారు, కానీ అది కాస్తా పొగడ్తల పూలదండలా మారి జగన్ మెడలో పడింది. అప్పటి జగన్ ప్రభుత్వం ముందుకెళ్లినవిధానంపూర్తి వివరాలుకూడా అధికారికంగా ఉన్నవి. నేటి ప్రభుత్వం ఆ ప్రాజెక్టు కోసం విమర్శించాలన్న గ్రౌండ్ లెవెల్ లో చేసిన పని అభివృద్ధి అన్నీ కూడా రికార్డ్ ఫార్ములాను ప్రాక్టికల్గా కూడా అక్షరాలా ఉండడం అందుకు కారణం కూడా. ఏదేమైనప్పటికీ సాక్షాత్ సంబంధిత శాఖ మంత్రి గత ప్రభుత్వము జెట్ స్పీడ్ తో పనులు జరిపింది అని చెప్పడం ప్రతిపక్షానికి కొంత ప్రతిపక్షానికి కొంత ఊరట నిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here