

నవతరం, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం మర్యాద పూర్వకంగా కలిసి ఇటీవల నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు నా మీద చూపించిన ప్రేమ అభిమానం ఎప్పటికీ మరువలేనిది అని పద్మనాభం తెలియచేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ మీరు త్వరగా కోలుకుని ప్రజలలో తిరిగి పార్టీ బలోపితానికి కృషి చెయ్యాలి అని తెలియచేశారు. ఈ సందర్భంగా పద్మనాభం మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్టీ విజయంకు శక్తివంచను లేకుండా కృషి చేస్తానని తెలిపారు. జగన్ ను కలిసిన వారిలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి ముద్రగడ గిరిబాబు, ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు మరియు రాష్ట్ర కాపు జేఏసీ మెంబర్ తోట రామకృష్ణ, కాకినాడ జిల్లా ఐటీవింగ్ అధ్యక్షులు గౌతు స్వామి ఉన్నారు.

