మంత్రిని కలసి వినతి పత్రం అందజేసిన అంబిర్ చెరువు మత్స్యకార సంఘం సభ్యులు
కూకట్ పల్లి: కూకట్ పల్లి సర్కిల్, శేర్లింగంపల్లి అంబీర్ చెరువు మత్స్య సహకార సంఘం సభ్యులు బుధవారం తెలంగాణ మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు శంషి గూడా మత్స్యకారుల సంఘం సభ్యులు అంబిర్ చెరువులో చేప పిల్లలను వదలాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంషి గూడ మత్స్యకార సంఘం అధ్యక్షులు జె లింగమయ్య, జె బాలరాజు, జె భాస్కర్ జె పద్మారావు కే శంకర్ జె బాలరాజ్ నరసింహచారి ఎన్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


