ప్రభుత్వానికి సెగ తగిలిందా…..?

0
671

నవతరం, ఆంధ్రప్రదేశ్: ఎవరైనా చిరాగ్గా రోడ్డు ఎక్కుతారు… లేదా… కోపంగా రోడ్డు ఎక్కుతారు ….!..
ఈ వైసీపీ వాళ్ళు… పొందికగా ఏదో గోడ కట్టినట్టు… గులాబీ మొక్కకు అంటుకట్టినట్టు…! ఎంతో క్రమశిక్షణగా… చాలా శ్రద్ధగా… ఎంతో పద్ధతిగా… ప్రభంజనమై రోడ్డు ఎక్కారు…
నేను… మా విజయనగరంలో వచ్చిన జనాన్ని, నాయకులను చూసి… ఇది రికార్డ్ అనుకున్నాను..
ఇంటికి వచ్చి ఒకపక్క ఫోన్, మరొకవైపున టీవీ ఆన్ చేస్తే…. రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటిన సంబరంలా అనిపించింది…
దాడిశెట్టి రాజా దంచి కొట్టాడు… అనంతపురంలో అదరగొట్టారు… కడపలో కదం తొక్కారు… పల్నాడులో పౌరుషం చూపించారు…. శ్రీకాకుళంలో సితక్కొట్టారు… గోదావరి జిల్లాల్లో గర్జించారు…. ఇలా ఏ జిల్లాలో చూసినా చించి ఆరేశారు..
సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే… ఏలూరు …సాలూరు …ఆ ఊరు.. ఈ ఊరు అని లేదు…. అన్ని ఊర్లలో… ఊర మాస్ జాతరలా… ఉతికి ఆరేశారు…!
సోషల్ మీడియా సైనికులు… లైవ్ లు పెట్టి…. కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో… సూపర్ సక్సెస్ అయ్యారు..!
మీడియా సిబ్బంది… ఉరుకులు, పరుగులతో చెమటోడ్చి పూర్తి ఎఫర్ట్ పెట్టి… తమ శక్తికి మించి కవరేజ్ ఇచ్చారు…!
ఇదంతా ప్రజా శ్రేయస్సు కొరకు, పార్టీ అధ్యక్షుడు తీసుకున్న ఎజెండా గొప్పదనం అని చెప్పవచ్చు…
ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ కి… ప్రత్యర్థులు హ్యాండ్సప్… అంతే…. ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా ప్రభుత్వాలు వాటిని అమలు చేసేవిధానములో వైఫల్యం చెందితే ప్రతిపక్ష పాత్ర కీలకమైనది. వాస్తవానికి ప్రతిపక్ష గౌరవము వైయస్సార్ పార్టీకి పాలక పక్షం కల్పించకపోయిన బాధ్యతాయుతమైన ప్రతిపక్షముగా వ్యవహరించడంలో ప్రజల పక్షాన అనుక్షణం ఉంటూ క్రమశిక్షణతో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పౌరులకు సుపరిపాలన అందాలని చట్టం న్యాయం ధర్మం అందరికీ సమానమైన రీతిలో నిరంతర పోరాటం చేస్తున్న వైయస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రియాశీల పాత్రను పోషిస్తూ నిజంగా రాజకీయ దురంధరుడుగా భవిష్యత్ తరాల బాగోగుల కోసం ఆలోచించే తన పరిపాలనలో ప్రత్యేకమైన వినూత్న పద్ధతిలో సంస్కరణలతో కూడిన పరిపాలన నాడు అందించడంతోపాటు నేడు కూడా తనదైన శైలిలో ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటం చేస్తున్నారు అనుటకు నేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఒక ఉదాహరణ.