
నవతరం, సోంపేట: కొత్త ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సందర్భంగా సోంపేట మండల ప్రజానీకంతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు ఎంపీపీ, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ నిమ్మన దాస్ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం పాత్రికేయులతో ఈ సందర్భంగా డాక్టర్ దాస్ మాట్లాడుతూ.. చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు. దుర్భలతను పారదోలి, లోపాలను సరిదిద్దుకునే శక్తిని పొందాలని ఆకాంక్షించారు. నిజాయితీ, విశ్వసనీయతలే మన లక్ష్యం కావాలన్నారు. నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, అభివృద్ధి బాటలో నడవాలని డాక్టర్ దాస్ కోరారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

