పిపిపి విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి…

0
6

సిపిఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ డిమాండ్…

ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్…


నవతరం, శ్రీకాకుళం: పిపిపి విధానాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ప్రమాదకరమైనదని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మధ్యాహ్న మొజ్జాడ, యుగంధర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కే సాయికుమార్ అన్నారు. ఈరోజు శ్రీకాకుళంలో స్థానిక రామలక్ష్మణ జంక్షన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ ప్రైవేటీకరణ విధానం విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్య తరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతుందని, రాజ్యాంగం లోని మౌలిక సూత్రాలకు విరుద్ధమై సామాజిక వర్గాల అభ్యున్నతికి భంగం కలిగించే చర్యగా రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను పిపిపి విధానంలో ప్రైవేటీకరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నెంబర్ 590 ని జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్య సీట్ల సంఖ్య పెరుగుతుందని, వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించడం జరిగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 590 పేరుతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి జీవో నెంబర్ 590 తక్షణమే ఉపసంహరించుకోవాలని, గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 107జీవో నెంబర్ 107, 108ను రద్దు చేయాలని, నూతన వైద్య కళాశాలలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మించి నిర్వహించాలని, వాటిని శాశ్వత ప్రభుత్వ, ప్రజా ఆస్తులుగా నిలిపి, పేద ప్రజలు వైద్య విద్య హక్కును, సామాజిక న్యాయాన్ని భవిష్యత్తు తరాల అవకాశాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అన్నాజీ, వసంతరావు, ఏఐవైఎఫ్ నాయకులు వై వేణు, మహేష్, కిషోర్, రామోజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here