పాఠశాలలు పునఃప్రారంభం….

0
286

నవతరం, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 61 వేల ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెట్‌ పాఠశాలల్లో 70 లక్షల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాలయాలు ప్రత్యేక జాగ్రత్తలతో తెరచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.తరగతుల నిర్వహణకు ప్రత్యేక ఎస్‌వోపీ

ప్రతి సెక్షన్‌కు 20 మంది విద్యార్థులు మించకుండా తరగతుల నిర్వహణ

ప్రతి విద్యార్థి మాస్క్‌ ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరి

ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎప్పటికప్పుడు కోవిడ్‌ టెస్ట్‌లు చేసేలా చర్యలు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు వంద శాతం వ్యాక్సినేషన్‌