
నవతరం, కిర్లంపూడి: నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లి విరియాలని వైయస్సార్సీపి ప్రత్తిపాడు కోఆర్డినేటర్ ముద్రగడ గిరి ఆకాంక్షించారు….!.. ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్త ఏడాదిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. 2026లో ప్రతి ఒక్కరికి దైవాను గ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలాషించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించినప్పుడే మెరుగైన సమాజ స్థాపన సాధ్యమవుతుందని, ఆ దిశగా అందరూ ముందుకు నడవాలని కోరారు. నూతన సంవత్సరంలో శాంతి, శ్రేయస్సు, ఉల్లాసం, సంతోషాలు విలసిల్లాలన్నారు. ఉజ్వల భవిష్యత్తు, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, నూతన లక్ష్యాలను సాధించడానికి కొత్త ఏడాది ప్రేరణ ఇస్తుందని ముద్రగడ గిరి తెలిపారు. ఇంటి దగ్గర అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు.

