
నవతరం, నర్సాపురం: పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాలలో ప్రజాసమస్యల పరిష్కారానికి నిరసన ప్రదర్శనల ద్వారా పోరాడునున్నామని నరసాపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం పట్టణం 13వ వార్డులోని పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షురాలు ఎస్డి నసీమాబేగం ఇంటివద్ద నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నియోజకవర్గ సమస్యలపై దూకుడు పెంచమని ఆదేశాలు ఇచ్చినందున ప్రజా సమస్యలపై దృష్టి పెట్టామన్నారు. రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ భీమవరం పట్టణం భీమవరం మండల గ్రామాలను కలుపుతూ యనమదుర్రు డ్రెయిన్ పై నూతన వంతెనలు నిర్మాణాలు పూర్తిచేసి ఏళ్ళు గడుస్తున్నా ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేయకపోవడం వల్ల ప్రజలు అనేక కష్టాల గురవుతున్నారని ఇదే విషయంపై ఈనెల 14వ తేదీన వంతెన వద్ద భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సమావేశంలో వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనువాస్ వీరవల్లి శ్రీనివాస్ భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు రేవు వెంకన్న కౌరు పృద్విశంకర్ నాయకులు ఎండి షబీనా మాదాసు కనకదుర్గ కోళ్ల నాగబాబు మెంటే గోపి ఎద్దు ఏసుపాదం గంట త్రిమూర్తులు మైలబత్తుల ఐజాక్ బాబు పాల్గొన్నారు.

