
వంగవీటి రాధాకు చంద్రబాబు పరామర్శపై ఎమ్మెల్సీ తోట ధ్వజం…
మండపేట: తండ్రిని చంపిన వ్యక్తి.. తనయుడిని పరామర్శించడం సిగ్గుచేటని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.
ఆనాడు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, ప్రజా సమస్యలపై నిరాహార దీక్ష వ్యక్తి రాత్రి సమయంలో నిద్రలో ఉండగా చంద్రబాబు అనుచరులతో చంపించిన మాట వాస్తవం కాదా? ఆనాటి మీ సహచర మంత్రి హోంమంత్రి జోగయ్య గారు చెప్పిన మాట వాస్తవం కాదా? ఆనాడు వంగవీటి రంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజలు అతనిని దైవంగా కొలుస్తున్నారని భావించి ఇంత దారుణానికి ఒడిగట్టిన మాట వాస్తవం కాదా? కాపులలో బలమైన నాయకుడు ఉంటే మీ మనుగడ కష్టమనే కదా రంగాను పొట్టను పెట్టుకున్నారు. మీకు ఎన్నికల ముందు కాపుల ఓట్లు కావాలి కాబట్టి కాపులు గుర్తుకు వస్తారు. అంతే కాపులపై మీకు నిజమైన ఏనాడైనా కలిగిందా? ఆనాడు తండ్రిని పొట్టని పెట్టుకుని ఈనాడు ఆ ఇంటి గుమ్మం తొక్క డానికి మనస్సు ఎలా మీకు, తండ్రి లా కొడుకు కూడా మీకు అడ్డోస్తున్నాడని అనిపిస్తుందా? మీ కుట్ర రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు, ఇప్పటికైనా నీతిగా రాజకీయాలు చేయండి. అంటూ తోట తీవ్ర స్థాయిలో చంద్రబాబు పై మండి పడ్డారు.

