జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి…Apuwj

0
245

భీమవరంలో జర్నలిస్టుల కోర్కెలదినం..


నవతరం, భీమవరం: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మే 10 న “జాతీయస్థాయి కోర్కెలదినం” పాటించాలన్న ఐ.జే.యు., ఏ.పి.యు.డబ్ల్యు.జే. పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం లో కలెక్టర్ కార్యాలయంలో డి.ఆర్.ఒ కి పాత్రికేయులు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. యూనియన్ నాయకులు జర్నలిస్టుల సమస్యలను ఆమెకు వివరించారు. వినతిపత్రాన్ని ప్రభుత్వానికి పంపుతామని డిఆర్వో హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐ.జే.యు జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ పై జరుగుతున్న దాడులను ప్రభుత్వ అరికట్టాలని డిమాండ్ చేశారు. జర్నలిజాన్ని భయపెట్టే విధంగా పోలీసులు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. కరోనాలో మృతి చెందిన జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పదిహేను డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఏ.పి.యు.డబ్ల్యు.జే జిల్లా కార్యదర్శి వి.ఎస్.సాయిబాబా, సహాయ కార్యదర్శి టి.అయ్యప్ప, రాష్ట్రకౌన్సిల్ సభ్యులు వై.గిరిజా పతి, బెల్లంకొండ బుచ్చిబాబు, భీమవరం ప్రెస్ క్లబ్ కార్యదర్శి బోణం శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు ఆర్.కిషోర్, కర్రి ప్రేమ్ కుమార్ , కడలివరప్రసాద్, సి.హెచ్.బంగారరావు, పి.శ్రీనివాసరావు, వి.లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.