జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భద్రత బాధ్యత కేంద్రానిదే: పంతం నానాజీ

0
80



ఈ రాష్ట్రానికి ఏమైంది..

నవతరం, కాకినాడ రూరల్: ఈ రాష్ట్రానికి ఏమైందని, విశాఖ సంగతి మర్చి పోకుండానే మళ్లీ ఈ మధ్య జనసేన అధినేత ఇంటి చుట్టూ తిరుగుతూ దాడి చేయాలనుకుంటున్నారని పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ అన్నారు. గురువారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ జనసైనికులు ప్రతీ చోటా ఉన్నారని తెలుసుకోవాలని రాజ్యాంగాన్ని గౌరవించి తాము మసలుకుంటుంటే చేతగాని తనంగా భావించవద్దని హితవు పలికారు. ఆంధ్ర నుండి హైదరాబాదుకు పంపి మరీ తమపై దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రం రాక్షస పాలన నుండి విముక్తి కోరుతున్నామన్నారు. పవన్ దాడి అంశం అక్కడ తెరాస ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని దాడికి సంబంధించిన మూలాలు ఆంధ్ర నుండే ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు మానుకోవాలని దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరుగుతుందని పేర్కొన్నారు. పరిపాలన చేతకాకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని గవర్నర్ ను కోరతామన్నారు. దాడులు సమంజసం కాదని.. రండి ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని వ్యాఖ్యానించారు.మహిళలకు రక్షణ కల్పించాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి కలవడానికి వెళ్ళిన మహిళకు భద్రత లేదన్నారు.