చట్ట సభల్లో మేధావులు కొరత లేదు…
నవతరం, న్యూఢిల్లీ: రామ్ జెఠ్మలానీ, సుబ్రహ్మణ్య స్వామి లాంటి అపర మేధావులు చాలా మంది చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
చట్ట సభల్లో మేధావులు కొరత లేదు కానీ త్రికరణ శుద్ధిగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన పరిస్థితులు కాన రావడం లేదు. ఎంతోమంది నేటి వరకు మేధావులు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. కానీ వారి పరిజ్ఞానం సామాన్యులకు న్యాయం జరగడంలో విఫలమౌతుంది. దానికి కారణం రాజకీయ కోణమా? లేక వారి వ్యక్తిగత స్వార్థమో తెలియడం లేదు. ఏదిఏమైనప్పటికీ సామాన్య పౌరులకు నేటి వరకూ పూర్తి స్థాయిలో స్వాతంత్ర్య ఫలాలు అందలేదన్నది జగమెరిగిన సత్యం. ప్రతీ రాజకీయ పార్టీ ఓటు బ్యాంకు కోసం, కులాలు, మతాలు, వర్గాల పేరుతో తాయిలాలు ప్రకటించడం ఓట్లు కోసం సంక్షేమం తప్ప అన్ని వర్గాల్లో అల్పాదాయ వర్గాలకు సముచితమైన న్యాయం జరగడం లేదన్నది యదార్థం.
ఈ నేపథ్యంలో ఎంతోమంది మేధావులు ఎన్నో రాజకీయపార్టీలు మారుతూ చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్పాదాయ వర్గాలకు
న్యాయం జరుగుతుందనేది ఎండమావిలో నీరు వెతికి నట్లే. 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత ఉన్నత న్యాయస్థానంలో ప్రముఖ వ్యక్తి చట్ట సభల్లో సముచితమైన చర్చ జరుగడంలేదని వ్యాఖ్యానించడం పరిపాటే. ఇప్పటికైనా చట్ట సభలు ప్రజలు ఆదాయంతో నడుస్తున్న ప్రజల కోసం సముచితమైన చర్చ జరిపేందుకు కృషిచేస్తూ ప్రతీ ఒక్క పౌరుడుకు స్వాతంత్ర్య ఫలాలు అందేందుకు అన్ని వర్గాలకు, కుల మతాలకు అతీతంగా న్యాయం జరగాలని ఆశిద్దాం. నేటి న్యాయం వ్యవస్థలలో కొందరు వ్యక్తులు కూడా రంగులు పులుముకుంటూ ముందుకు సాగుతున్నాయనేది ప్రజాభిప్రాయం.
ఇప్పటికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరగాలన్న, దేశం అభివృద్ధి చెందాలన్న న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యం లేకపోయినప్పుడే దేశంలో ప్రతీ సామాన్యుడుకీ స్వాతంత్ర్య ఫలాలు అందుతాయనడంలో సందేహంలేదు.

