ఆమె.. ఖరీదైన జరీచీర కట్టిభుజాన శాలువా చుట్టి.. చలువ కళ్లద్దాలు పెట్టిరాజభవంతి మెట్లుదర్జాగా దిగుతుంటే అచ్చెరువొందిన జనం ఆహా.. రాణీ మాలినీదేవి అని మురిసిపోయారు… ఆ దర్పం.. పొగరు.. జమునకే చెల్లు..!
అదే జమున… అలిగి శయ్యపై పరుండి శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ కిరీటంపై తంతే సత్యభామకు ఇంత టెక్కా అని ముక్కున వేలేసుకున్నారు… మీరజాలగలడా నా యానతి వ్రత విధాన మహిమన్.. జమునకే ఒప్పినభంగిమన్..!
అదే అభినేత్రి.. అమ్మా కాఫీ అంటూ గారాలు పోతూ.. పెళ్ళిచూపులకి వచ్చిన పెద్దమనిషి ఎస్వీఆర్ కి సరోజ అని పుల్ల విరుపుగా చెబితే గుండమ్మ ఇలాగే ఉండాలని తెగ నచ్చేసారు.. నందమూరే విస్తుపోయేలా ఎవడమ్మా వీడు అంటూ అంజిగాడిని గురించి అడిగితే ఆశ్చర్యపోయినా డాబాపై తిష్టవేసిన రాజాకి అమృతాంజనం రాసి సిగ్గుపడితే పెద్దింటి పిల్ల సొగసుగా సిగ్గుపడిందనుకుని ముచ్చటపడ్డారు నాటి తెలుగింటి అమ్మలక్కలు..!
కైకమ్మ కులుకు.. తాసిల్దార్ గారమ్మాయి తళుకు ఉండమ్మా బొట్టు పెడతా అంటూ లచ్చిమి తల్లినే ఆపేసిన అణకువ.. ఏ పాత్రకు ఏ అభినయంఅవసరమో.. అందమో ప్రదర్శించే మెలకువ.. మంగమ్మ శపథం.. శబరి భక్తి.. ద్రౌపది పంతం.. జమునకే నప్పిననటన.. ఆమెకే ఒప్పుననే అభిమాన భావన..!
అంతటి అందాలరాశి అనారోగ్యంతో మూగనోము పట్టి నేనోడిపోయి గెలుపొందినాను అంటూ కడదాకా పరిశ్రమతో పాటు చెక్కుచెదరని బంధం.. ఒకనాటి ఆమె సౌందర్యం.. అక్కలు సావిత్రి.. అంజలి.. భానుమతి వెళ్ళినా హుషారుగా కళ్ళముందు నిన్నమొన్నటి వరకు తిరుగాడిన ఆరోగ్య రహస్యం.. అదే అదే వింత నేను తెలుసుకున్నది.. అందా.. లేక మాను మాకును కాను రాయి రప్పను కానేకాను ఈ మామూలు మనిషిని నేను.. మీ జమునను నేను.. అన్నదా మన అచ్చ తెలుగు గౌరమ్మ!
జమునమ్మ వర్ధంతి: 27.01.2023
ఎలిశెట్టి సురేష్ కుమార్,
విజయనగరం.