• ఇప్పటిదాకా సాధించిన పథకాలు 2580
• ‘2580’ అవార్డులతో చరిత్ర సృష్టించిన ‘యువ కవి’ జటావత్ మునినాయక్
• గిన్నిస్ బుక్ లో పేరు నమోదు
• వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత
• 5 నంది అవార్డులు, ప్రపంచ స్థాయిలో 53 అవార్డులు
• రాష్ట్ర స్థాయిలో 501 అవార్డులు
• జిల్లా, ఇతర సాహిత్య, సామాజిక రంగాలలో 2004 అవార్డులు
• కవి రత్న, సామాజిక సేవకుడు, ఇతర 16 బిరుదులు ఈయన సొంతం
• భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
• ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్
• తెలుగు అసోషియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ లలో పేరు నమోదు
• టాలీవుడ్ ఫిలిం ఫెర్ స్పెషల్ జ్యురి అవార్డు
• మై ఫ్రెండ్స్ పోలీస్ అడ్డా గ్రూప్ ద్వారా 2000 విద్యార్థిని విద్యార్థులకు సేవలు • తను ఎదుర్కొన్న సమస్యల నుంచే రచనలు పుట్టాయి
మారుమూల తాండాకు చెందిన జటావాత్ మునినాయక్ రాష్ట్ర – జాతీయ స్థాయితో పాటు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం జాల్ తండాకు చెందిన కవి, రచయిత జటావత్ మునినాయక్ కు గత కొన్ని సంవత్సరాలుగా సాహిత్య రంగంలో, సామాజిక సేవలలో గుర్తింపు దక్కింది. తన చిన్నతనం నుండి సేవే లక్ష్యంగా ఎంచుకున్న సేవాజీవి జటావాత్ మునినాయక్. ఈయన సేవలను గుర్తించిన పలు సంస్థలు, సంఘాలు ఎన్నో అవార్డులను, పథకాలను ప్రధానం చేశాయి. అంతేకాకుండా నేషనల్ సర్విస్ స్కీమ్ శిబిరాల్లో పాల్గొని గ్రామ స్థాయి నుంచి మొదలుకొని ప్రపంచ స్థాయి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించిన ‘జటావాత్ మునినాయక్, కఠోర శ్రమ, ఆశయంపై ‘నవతరం’ ప్రత్యేక కథనం..
హైదరబాబాద్, నవతరం: సమాజంలోని వ్యక్తులు, పరిసరాలు, తాను ఎలా వెళ్లాలో మార్గాన్ని చూపాయి. ప్రతి ఒక్క అడుగు కొత్త కొత్త అంశాలని నేర్పుంచాయి. మారుమూల తండాకు చెందిన జటావత్ మునినాయక్ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయితో, పాటు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు జటావత్ మునినాయక్. విశిష్ట కృషి చేస్తున్న నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం జాల్ తండాకు చెందిన కవి, రచయిత జటావత్ మునినాయక్ కు గత కొన్ని సంవత్సరాలుగా సాహిత్య రంగంలో, సామాజిక సేవలలో మునినాయక్ వివిధ కవితలు రాస్తూ రాణిస్తున్నారు. సాహిత్య రంగంలో చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులు ప్రధానం చేశారు. మారుమూల గిరిజన తండాకు చెందిన యువకుడు అట్లెటిక్స్ లో రాణిస్తూ అందరి మన్ననలు పొందాడు. లాంగ్ హై జంప్ లో జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. దీనితో పాటు ఎన్ఎస్ఎస్ శిబిరాల్లో పాల్గొని గ్రామా స్థాయి నుంచి మొదలైన పయనం ప్రపంచ స్థాయి గిన్నిస్ బుక్ లో పేరు నమోదయ్యేలా కఠోర శ్రమలు చేసి, ప్రతి చెమటకు చరిత్ర రాస్తూ నేటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు జాల్ తండాకు చెందిన జటావత్ మునినాయక్.
కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు
కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు జటావత్ మునినాయక్. తండాకు చెందిన జటావత్ లక్ష్మ నాయక్, కమల దంపతులకు ఏడుగురు సంతానం కాగా అందులో మునినాయక్ మూడో వాడు. తల్లి తండ్రులు కూలి పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. మునినాయక్ చదువుతో పాటు సామాజిక సేవ రంగంలోనూ, క్రీడా రంగంపై ద్రుష్టి సారించాడు. అథ్లెటిక్స్ విభాగములో లాంగ్ జంప్, హై జంప్ లో జిల్లా స్థాయి లో మెరుగైన ప్రతిభను కనబర్చి పతకాలను సాధించాడు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత పొందాడు.
సేవా రంగంలోనూ..
మునినాయక్ క్రీడలతో పాటు సేవారంగంలో కూడా జాతీయ స్థాయిలో తన సేవలు అందించి అందరి మన్ననలు పొందాడు. ఎన్ఎస్ఎస్ లో నేషనల్ క్యాంపు, యూనివర్సిటీ క్యాంపులు, మెగా క్యాంపులలో, ప్రజలలో చైతన్యపరచడానికి అవైర్నెస్ ప్రోగ్రామ్స్ లను చేపడుతూ సేవ దృక్పదాన్ని చాటుతున్నాడు. మునినాయక్ ప్రాథమిక విద్య నెల్లికల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ నాగార్జున సాగర్ గవర్నమెంట్ కాలేజ్ లో విద్యనభ్యసించాడు. డిగ్రీ మాత్రం జిల్లా కేంద్రం లోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేసాడు, అర్థశాస్త్రం లో పిజి పూర్తి చేసి, అండర్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో లో ఉన్న వివేకా వర్దిని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలెజ్, కోటి హైదరాబాద్ పూర్తి చేసారు. ఆయా కళాశాలల్లో చదివే సమయంలోనే తాను అనేక పర్యాయాలు ఎన్ఎస్ఎస్ శిబిరాల్లో పాల్గొని బహుమతులు పొందాడు. సామాజిక సేవ ప్రజల తరుపున గ్రామాభివృద్ధి కృషి చేస్తూ నేటి యువతకు ఆదర్శముగా నిలుస్తున్నాడు మునినాయక్. ప్రస్తుతం మునినాయక్ ప్రభుత్వ కొలువు కోసం పోటీ ప్రపంచం తో పోటీ పడుతున్నాడు.
మునినాయక్ సాధించిన అవార్డులఎన్నో..
ఇప్పటివరకు ముని నాయక్ 2580 అవార్డులు అందుకున్నారు. 2014 లో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి సేవ కార్యక్రమంలో పాల్గొని ఓ పతకం, సమదర్శిని తెలుగు సాహిత్య పరిశోధన సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయిలో నిర్వహించిన దాశరధి కృష్ణమాచార్యుల జీవిత సాహిత్యంలో దాశరధి పురస్కారం అందుకున్నారు, 2020 సంవత్సరంలో పుడమి సాహితి వేదిక నల్గొండవారు నిర్వహించిన సాహిత్య రంగంలో వివిధ కవితలు రాస్తూ రాణిస్తున్నందుకు జాతీయ పుడమి పురస్కారాలు సామాజిక సేవ అవార్డు అందజేశారు. సోషల్ ఎంట్రీప్రెన్యూర్ జాతీయ అవార్డు నందమూరి లక్ష్మి పార్వతి చేతుల మీదుగా అందుకున్నారు. అదే సంవత్సరంలో విశిష్ట జాతీయ ప్రతిభా పురస్కారం, జాతీయ సేవ రత్నా అవార్డు, పద్మశేఖర జాతీయ ప్రతిభ పురస్కారం, జాతీయ సాహిత్య సేవ పురస్కారం అందుకున్నారు. 2013 లో ఎమ్కెఆర్ దేవరకొండ డిగ్రీ కళాశాలలో, 2014 లో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి సేవ కార్యక్రమంలో పాల్గొని పతకం సాధించారు. అంతే కాకుండా లోకల్ క్యాంపులన్నీ పూర్తి చేసాడు. 2015లో నల్గొండ నాగార్జున కళాశాలలో, 2016 లో నల్గొండలోని చిన్నమాచారం ఎన్ఎస్ఎస్ క్యాంపులో, 2017 నల్గొండ తొరగల్ జాతీయ సేవ కార్యక్రమంలో పాల్గొని పలు పథకాలు సాధించాడు. 2017 తరువాత హైదరాబాద్ ఉస్మానియా గడ్డ మీద నుంచి ప్రపంచ స్థాయిలో 2000లకు పైగా అవార్డులు సాధించాడు. అంతేకాకుండా, 2017 లో నల్గొండలో మేకల అభినవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని లాంగ్ జంప్, హై జంప్ లో జిల్లా స్థాయి మోడల్ ప్రశంశ పత్రం సాధించాడు. ఇదే తరుణంలో గిరిజన ప్రజా సమాఖ్య సోషల్ మీడియా అధ్యక్షులుగా, ఆర్టీఐ ప్రతినిధిగా నియమితులయ్యారు.
గ్రామీణ సేవలో…
తన చుట్టూ ప్రక్కల ఉన్న ఏ సమస్యలపై అయినా స్పందించి గ్రామాభివృద్ధికి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రజలకు అండగా నిలుస్తూ అహర్నిశలు శ్రమిస్తుంటాడు. ప్రజలకు అత్యవసరమైన నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ లోను తనదైన పాత్ర పోషించి నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అనేక పోరాట ఫలితంగా సాధించారు. మై ఫ్రెండ్స్ పోలీస్ అడ్డా గ్రూప్ ద్వారా.. గ్రూప్ ల ద్వారా 2000 కి పైగా స్త్రీ, పురుషులకు, గత ఐదు సంవత్సరములుగా చదవలేని, బుక్స్ కొనలేని వారికీ ఆర్థిక స్తోమతతో చదువు మధ్యలోనే ఆపేసి జాబ్ కొట్టాలని ఆశ ఉన్న వాళ్లకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల వలన చదవలేకపోతున్న యువతి, యువకులకు మై ఫ్రెండ్స్ పోలీస్ అడ్డా అనే వాట్స్ అప్ గ్రూప్ తయారు చేసి వాళ్లకు కావాల్సిన అన్ని సమాచారం ఉచితముగా అందిస్తున్నారు.
నా మనోగతం.. రచయిత మునినాయక్..
జటావత్ మునినాయక్ ప్రస్తుతం అతని పీజీ పూర్తి చేసి పోటీ ప్రపంచంతో పోటీ పడుతున్నారు. అతను పోలీస్ కావాలన్నా సంకల్పంతో తనతో పాటు తన మిత్రులు కూడా జాబ్ కొట్టాలని మై ఫ్రెండ్స్ పోలీస్ అడ్డా అనే గ్రూప్ ద్వారా కావాల్సిన సమాచారాన్ని ఉచితముగా అందిస్తూ తను కూడా ప్రిపేర్ అవుతున్నాడు. వాటితో పాటు సామాజిక సేవా, తన ప్రాంతం గురించి ఎలాంటి సమస్య వచ్చిన అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తారు. సమాజం మీద జటావత్ ముని నాయక్ కవితలు రాస్తూ అనేక అవార్డులు పొందుతూ నేటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. జటావత్ మునినాయక్ ప్రభుత్వం ద్వారా ఏమన్నా సహకారం లభిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నాడు.







