
నవతరం, విశాఖపట్నం: శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాలు నియంత్రణలో భాగంగా క్రైమ్ రిపోర్టర్స్ సహకారం మరువలేనిదని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రతబాగ్చి అన్నారు. డీజిపీగా పదోన్నతి పొందిన ఆయన్ను సోమవారం విశాఖపట్నం క్రైమ్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షుడు దాడి రవికుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెస్సార్ ప్రసాద్, కార్యదర్శి సతీష్ లు అసోసియేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పోలీస్ కమిషనర్ కు వివరించారు. జర్నలిస్టులు ఎప్పుడూ సామాజిక స్పృహతో వార్తా కథనాలను ప్రచురించాలని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. పోలీస్ కమిషనర్ ను కలిసిన వారిలో అసోసియేషన్ కార్య నిర్వాహక కార్యదర్శి భానోజీరావు, కోశాధికారి పొట్నూరు వాసు, ఉపాధ్యక్షుడు బండి శివరాం, సంయుక్త కార్యదర్శి నల్ల రాము, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాసరావు, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్నెగంటి విజయ్ మోహన్ తదితరులు ఉన్నారు.

