కోటికి పైగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం…

0
152

28 రోజులకు 1.56 కోట్ల ఆదాయం…



నవతరం, ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం రూ.1,28,07,874లు ఆదాయంగా లభించింది. అన్న ప్రసాదం హుండీల నుంచి రూ.28,23,211 ల ఆదాయం లభించింది. మొత్తం 28 రోజులకు గాను రూ.1,56,31,085 లు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు. నగదు తో పాటు 27 గ్రాముల బంగారం, 1 కేజీ 150 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 10 దేశాలకు చెందిన 43 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అంతర్వేది దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఎం.కె.టి.ఎన్.వి ప్రసాద్ తనిఖీదారుగా ఎస్.టి.పి.టి శ్రీనివాస్ రాజమండ్రి, ఎం సత్యనారాయణ ఈవో వెలిచేరు గ్రూప్ త్రీ దేవాలయాలు తదితరులు వ్యవహరించారు. అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది కలిసి హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here