
కూటమి ప్రభుత్వ పాలన కష్టాల మయం రెండేళ్లలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎన్నికలకు ముందు ఓ మాట… గద్దెనెక్కిన తర్వాత మరో మాట ప్రజలపై భారాలు మోపేలా కూటమి సర్కార్ చర్యలు విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై చిన్న చూపు నూతన సంవత్సరంలోనైనా ప్రభుత్వ పాలనలో మార్పులు రావాలి. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల వక్షానే వైయస్సార్సీపి వైఎస్ఆర్సిపి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి మరియా రామకృష్ణ నవతరం, పలాస: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం శూన్యమని, కొద్ది సమయంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, ప్రస్తుతం వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టి కుదేలయ్యాయని వైఎస్ఆర్సిపి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి మడియ రామకృష్ణ అన్నారు. బుధవారం పలాసలో ఆయన మాట్లాడుతూ.. 2025 సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలన స్కాముల మయంగా మారిందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పథకాలతో పాటు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలు అంటూ ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టారని మడియా రామకృష్ణ చెప్పారు. నేడు ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అంశం లోను ఒక్కో స్కాం వెలుగు చూస్తుందన్నారు. ఎన్నికలకు ముందు అధికారమే ధ్యేయంగా హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు కష్టాల మయంగా మారిందని రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతాంగానికి కష్టాలు తప్పవన్న అన్నానుడే మరోసారి నిజమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, గిట్టుబాటు ధరలు దక్కకపోగా.. సాగు కోసం చేస్తామన్న అన్నదాత సుఖీభవ సాయం కొందరికి ఇచ్చి మరి కొందరికి అందకుండా పోయిందన్నారు. బస్తా యూరియా కోసం రైతులు రోజులు తరబడి నిరీక్షించడంతో పాటు పోలీసుల లాఠీ దెబ్బలు తినడం ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుందని ద్వజమెత్తారు. పేద ప్రజలకు సైతం కార్పొరేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే సంకల్పంతో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకానికి పేర్లు మార్చుకోవడమే కాకుండా చివరికి సేవలు నిలిపివేసిన ఘనత కూటమి సర్కార్ దేనిని మరియా రామకృష్ణ ఆరోపించారు. వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన దుమ్మెత్తి పోశారు.

