
ఎల్లంపల్లి నర్సింలు కు దక్కిన డా. ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు…
అబ్దుల్ కలాం 91వ జయంతి వేడుకల్లో అవార్డు ప్రధానం..
హర్షం వ్యక్తం చేసిన సీనియర్ జర్నలిస్ట్ ఎల్లంపల్లి నర్సింలు.
శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు…
హైదరాబాద్, అక్టోబర్ 16 (నవతరం): భారత రత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 91 వ జయంతి వేడుకల్లో భాగంగా 15 అక్టోబర్ 2022న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో హోలిస్టిక్ మెడిసిన్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆద్వర్యంలో హిస్టారికల్ వరల్డ్ స్టూడెంట్స్ డే వేడుక 2022 సందర్భంగా నిర్వహించిన ‘సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఫెడరేషన్ అండ్ అవార్డ్స్ ఫంక్షన్ లో సీనియర్ జర్నలిస్ట్ ఎల్లంపల్లి నర్సింలు కు డా. ఏపీజే అబ్దుల్ కలాం ఎంపవర్మెంట్ అవార్డు 2022 ను ప్రధానం చేశారు.

సమాజంలో వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 101 మందికి అవార్డులు ప్రధానం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాద్ లో సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఫెడరేషన్ & అవార్డ్స్ (సిఫా), హెచ్ఎంఆర్ఎఫ్ ఇంటర్నేషనల్ యూనిట్ ప్రతిష్టాత్మకమైన డా. ఏపీజే అబ్దుల్ కలాం అవార్డ్స్ వేడుక విజయవంతంగా నిర్వహించింది. ఆరోగ్య సంరక్షణ, సామాజిక, రాజకీయ, క్రీడలు, ఆధ్యాత్మికం, సాహిత్యం, కళలు మరియు హస్తకళలు, వ్యవస్థాపకులు, విద్య మొదలైన వాటిలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వీబీదహ రంగాల వారి ప్రతిభను గుర్తించింది హోలిస్టిక్ మెడిసిన్ రిసెర్చ్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్. ప్రొఫెసర్ డా. దీపక్ రౌత్ (డైరెక్టర్ జనరల్, హెచ్ఎంఆర్ఎఫ్ ఇంటర్నేషనల్) అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు ఫరూక్ హుస్సేన్, శ్రీనివాస్ గౌరా (సోషలిస్ట్ అండ్ ఇండస్ట్రియలిస్ట్, వ్యవస్థాపకుడు, శ్రీనివాస్ గౌరా ఫౌండేషన్ కి ప్రధాన పోషకుడు), గౌరవ అతిథిగా మహమ్మద్ ఖలీద్ బిన్ సలేహ్ జాబ్రీ (సోషలిస్ట్ అండ్ కేఎస్ఏ లో ప్రిన్సెస్ రుబాత్ సలీమా బేగం కు సలహాదారు) హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ దీపక్ రౌత్ మాట్లాడుతూ డా. ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు అనేది హెచ్ఎంఆర్ఎఫ్ ఇంటర్నేషనల్ ద్వారా గుర్తింపు పొందిన వార్షిక వేడుక. శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక, పరివర్తనకు శక్తినిచ్చే అంకితమైన వ్యక్తి, పర్యావరణ, సంఘం, వారి చొరవను వ్యక్తీకరించడానికి ఇది ఉమ్మడి వేదిక అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారు సమాజాన్ని, ప్రశాంతంతను మెరుగుపరచడం కొరకు, ఏపీజే అబ్దుల్ కలాం యొక్క మిషన్‌ను సుసంపన్నం చేస్తుందన్నారు. డా. సుభానీ షేక్, డా. వసుధా రాణి, ప్రొఫెసర్ డా. పిఎస్ సాగర్, అశోక్ కొడపర్తి ఈ కార్యక్రమమాన్ని సమన్వయం చేసారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన మేధావులు, ప్రొఫెసర్లు, హోలిస్టిక్ మెడిసిన్ డిగ్రీ పొందిన విధ్యార్థులు, కళాపోషకులు, తదితరులు పాల్గొన్నారు.

