
నవతరం, కాకినాడ; జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్దశంకర్లపూడి గ్రామానికి చెందిన మొరకుర్తి నాగ వినోద్ యాదవ్ పై జనవరి 17 2022 తేదీన మీపై ఎక్సైజ్ మరియు ప్రొబిషన్ వారు కేసు కట్టారు. నీవు వచ్చి లొంగిపోవాలని ఎక్సైజ్ వారు హెచ్చరించారు. దీనిపై నాగ వినోద్ తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వర్ రావు గారిని కలిసి మీడియాతో మాట్లాడుతూ నేను గ్రామం లో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తను మా గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతుండగా ఆ ఘటనకు మా ఇళ్ళ గోడలు పగుళ్లు వచ్చి ఇల్లు కూలిపోయే స్థాయికి వచ్చాయి. ఈ ఘటనపై పెద్దాపురం ఆర్డీవో గారికి కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేశాను అని నాపై అక్కడ అధికార నాయకులుతో కలిసి నల్ల క్వారీ మైనింగ్ మాఫియా వారు అక్రమ కేసు పెట్టించారు. నేను సారా తయారు చేస్తున్నాను అని కానీ సారా అమ్మినట్టు గాని సంబంధిత శాఖ వారు నన్ను పట్టుకుని ఉంటే ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు కానీ కేసు నమోదు అయిన తరువాత వెల్లడించిన వార్తాపత్రికలో గాని ఉంటే దానిని బహిరంగంగా చూపించి నాపై విచారణ చేసి కేసు కట్టాలి లేదా ఎక్సైజ్ వారు నేను ఉంటున్న గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో నివాసం ఉంటున్న ఏ ఒక్కరిని తోటైనా నేను సారా తయారు చేస్తున్నట్లు గాని అమ్మినట్లు గాని చెబితే నేను ప్రభుత్వం వారు ఏ చర్యలు తీసుకున్న దానికి బాధ్యత వహిస్తాను. కానీ తప్పుడు కేసులు బరాయిస్తే మాత్రం ఊరుకునేది లేదు అల అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి ఇలాంటి తప్పుడు కేసులు పెడితే వారిపై ప్రత్తిపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయవలసి వస్తుంది.
పోలీసు వారు కూడా స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను అని నాగు వినోద్ యాదవ్ మీడియాతో అన్నారు. అలాగే తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్ది శెట్టి మాట్లాడుతూ నాగు వినోద్ పై పెట్టిన అక్రమ కేసును పూర్తిస్థాయిలో ఆ గ్రామంలో విచారణ జరిపించి పది నెలల క్రితం పెట్టిన కేసును ఫొటోలతో సహా చూపించకపోతే కాకినాడ జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ వారిని కలిసి ఈ అక్రమ కేసులు బరాయించిన వారిపై కేసు పెడతామని పెద్దింశెట్టి మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, మోరుకుర్తీ నాగ వినోద్, సారిపిల్లి రమేష్, నాగళ్ల శివ నాగేంద్ర పాల్గొన్నారు.

