‘అంబటి’ పై హత్యాయత్నం అమానుషం..

0
247

వారు కార్యకర్తలా.. గూండాలా? …..!..

మాజీ మంత్రుల ఇళ్ళ పై దాడి చేస్తారా…..?..

ప్రజల దృష్టి మళ్లించేందుకే కూటమి నేతల దాడులు….!..

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినడంతో.. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు అనాసక్తి ….!..

ఇలాంటి సంఘటనలను చంద్రబాబు ప్రోత్స హిస్తున్నారా….!..

రాష్ట్రంలో అరాచక పాలన వైయస్సార్సీపి జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు….!..

నవతరం, పలాస: వైయస్సార్సీపి రాష్ట్ర నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంలో మాయని మచ్చని ప్రజాస్వామ్యానికి కలిగించే చర్యని, ఇది ముమ్మాటికి అనాగరిక చర్య అని వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు తీవ్రంగా కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సోమవారం పలాసలో బమ్మిడి దుర్యోధనరావు వైసిపి కార్యాలయంలో మాట్లాడుతూ, మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేయడం అత్యంత హేయమని, ఇది తెలుగుదేశం ప్రభుత్వ నియంతృత్వ పాలనకు నిదర్శనమని బమ్మిడి దుర్యోధనరావు మండిపడ్డారు. అంబటి రాంబాబును అరెస్టు చేసే క్రమంలో పోలీసులు ప్రవర్తించిన తీరు.. తెలుగుదేశం పార్టీ గూండాలు చేసిన రౌడీయిజంపై ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడాన్ని హేయ మైన చర్యగా అభివర్ణించారు. సి.బి.ఐ ఇచ్చిన నివేదిక కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సిబిఐ ఆధ్వర్యంలో సిట్ నివేదిక సమర్పించడంతో, చంద్రబాబు చేసిన ఆరోపణలపై క్షమాపణలు కోరకుండా వెంటనే మాట మార్చి పంది కొవ్వు కాదని, కొన్ని రసాయనాలు కలిసాయంటూ మళ్లీ కొత్త రాగం అందుకుంటున్నారని బమ్మిడి దుర్యోధనరావు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమిన్ నేతలు సాగించిన దుష్ప్రచారం బూటకమని సిబిఐ నివేదికతో బట్ట బయ లైందన్నారు. అయినా టిడిపి నేతలు ఇంకా దిగజారి నీచంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడానికి అంబటి రాంబాబు ఖండిస్తూ, తక్షణం ఫ్లెక్సీలను తొలగించాలని సూచించారని, అప్పుడు జరిగిన వాగ్వాదంలో తెలుగుదేశం పార్టీ రౌడీలు అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి పాల్పడం అమానుషమన్నారు. అంబటి రాంబాబును ఎప్పుడెప్పుడు అరెస్టు చేద్దామని దురుద్దేశంతో పోలీసులు ఆయన్ని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ దాష్టికాన్ని చూస్తే రాష్ట్రంలో అరాచక, దుర్మార్గ పాలన నడుస్తుందనే విషయం అర్థమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు కూటమి పాలనలో రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న ఆయన తనయుడు నారా లోకేష్ పరిపాలనలో వైఫల్యం చెందినప్పటికీ, ఎలాగైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుమారుడికి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చి, తన పంతం నెగ్గించుకునే దుర్మార్గపు ఆలోచనతో ప్రజా కంటక పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఒకప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ బ్రహ్మాండంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచక పాలన సాగడంతో రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేస్తూ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారన్నారు. రాష్ట్రంలో గుండా రాజ్ పాలనకు కూటమి ప్రభుత్వం తక్షణం స్వస్తి పలికి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజాస్వామ్యం కాపాడేలా కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలు ఆలోచించాలని బమ్మిడి దుర్యోధనరావు సూచించారు.