
సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై లక్ష్మికాంతం…
నవతరం, ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం సంతోషిమాత ఆలయం సమీపంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరప మండలం నడకుదురు గ్రామానికి చెందిన భార్యాభర్తలు చిన్నఏలూరు గ్రామంలో పొలం పనులు చూసుకుని మోటార్‌సైకిల్‌పై ప్రత్తిపాడు వైపు వస్తున్నారు. సంతోషిమాత ఆలయం వద్ద రహదారి దాటుతుండగా దొడ్ల డెయిరీకి చెందిన పాల ట్యాంకర్ వారి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ బైక్‌పై నుంచి కింద పడిపోయింది. అనంతరం ట్యాంకర్ ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని బొడ్డు పద్మావతి (51), కొప్పుల వేలమ, నడకుదురు గ్రామం, కరప మండలం వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై ప్రత్తిపాడు ఎస్‌ఐ లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

