టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పెరిగిపోయిందని బాంబు పేల్చి ఇంటర్వ్యూలతో ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న సినీ నటి శ్రీరెడ్డి ఏ రోజు ఎవరి బతుకుని బస్టాండ్ చేస్తుందో అర్ధంకావడం లేదు. ఆ మధ్య యంగ్‌హీరోలు, సినీ డైరెక్టర్‌మీద ట్వీట్లతో దుమారం రేపిన శ్రీరెడ్డి…చివరికి సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములని కూడా తన ట్రాప్‌లోకి లాగేసింది. సారీ చెప్పకపోతే కంప్లయింట్ చేస్తానని కమ్ముల వార్నింగ్ ఇవ్వటంతో ఫ్యాన్స్ కోసం ఏవేవో పెడుతుంటాను…మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారంటూ కౌంటర్ ట్వీట్ ఇచ్చిన శ్రీరెడ్డి…ఇప్పుడు ఏకంగా ఓ సింగర్ బతుకుని బజారుకీడ్చింది.
శ్రీరెడ్డి కేవలం తన కామెంట్స్‌తో సరిపెట్టలేదీసారి. ఓ ప్రముఖ గాయకుడు తనతో జరిపిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి బరితెగింపుకు చిక్కుల్లో పడ్డ ఆ గాయకుడు మరెవరో కాదు. శ్రీరామ్. ఇండియన్ ఐడల్‌గా దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న టాప్ సింగర్ శ్రీరామ్. శ్రీరామ్‌తో శ్రీరెడ్డి దిగిన పిక్స్ కూడా చాట్‌లో ఉన్నాయి.
‘మన ఇండియన్ ఐడల్ చాట్‌ని ఒకసారి చూడండి. నువ్వు సిగ్గు పడాలి శ్రీరామ్. శ్రీరామ్ అనే పేరు తొలగించేయి. నీకు ఆ పేరుతో కొనసాగే అర్హత లేదు’
శ్రీరామ్ కంటే ముందు ఓ హీరోని టార్గెట్ చేసి కనుక్కోండి చూద్దాం అన్నట్లు హింట్స్ ఇచ్చింది సెన్సేషన్ బేబీ శ్రీరెడ్డి. తెరమీదే కాదు నిజజీవితంలోనూ ఆయన ‘న్యాచురల్’గా నటిస్తాడని, ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని శ్రీరెడ్డి ఆరోపించింది. అతను స్టార్‌హీరోల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ..అతనికి ఈ మధ్యే కొడుకు పుట్టాడని..తిట్టే నోటితోనే కంగ్రాట్స్ చెప్పింది. చేసిన తప్పులకు అతను కచ్చితంగా ఇబ్బందుల్లో పడతాడని శ్రీరెడ్డి చెప్పిన న్యాచురల్ స్టార్ ఎవరో ఓ అంచనాకొచ్చేసిన సినీజనం…జంటిల్మెన్‌లా కనిపించే అతను శ్రీరెడ్డితో ఎప్పుడు పెట్టుకున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు.
శ్రీరెడ్డి వ్యవహారం ముదురుతుండటంతో ఇక లాభం లేదనుకుంటున్నారు సినీ ప్రముఖులు. పరువు బజారుకు లాగి సంసారాల్లో నిప్పులు పోసేలా ఉందంటూ ఆమె నోటికి తాళం వేయాల్సిందేననే నిర్ణయానికి వచ్చారు. తెలుగు సినిమా ప్రముఖుల్ని కించపరిచేలా ట్వీట్లు, కామెంట్లు పోస్ట్ చేస్తున్న శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంక్వయిరీకి పిలిస్తే సీడీలు, సీక్రెట్ టేపులు బయటికి తీసి సెవెంటీ ఎంఎంలో సిన్మా చూపిస్తుందేమో అన్నిటికీ తెగించేసిన శ్రీరెడ్డి?