వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీలు ఆకలితో వెళ్లకూడదు…గుడ్ షెఫర్డ్ డైరెక్టర్ సిస్టర్ యాంటో

0
261

నవతరం, అమరావతి: వివిధ గ్రామాల నుండి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి వచ్చే గర్భిణీలు ఆకలితో వెళ్లకూడదని జన చైతన్య సమితి పోషకాహారాన్ని అందించడం అభినందనీయమని గుడ్ షెఫర్డ్ డైరెక్టర్ సిస్టర్ యాంటో అన్నారు. జన చైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అమరావతిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పెదకూరపాడుకు చెందిన దాసరి మరియమ్మ కుటుంబ సభ్యుల సహకారంతో బుధవారం గర్భిణీలకు భోజనంతోపాటు పోషకాహారాన్ని పంపిణీ చేసారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిస్టర్ యాంటో మాట్లాడుతూ గర్భిణీలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ల సూచనలను పాటించి ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వాలని కోరారు. గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం సుధారాణి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పిల్లలతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని, మానసిక ప్రశాంతతో పాటు శారీరకంగా ఉల్లాసంగా ఉండాలన్నారు. బుచ్చయ్య పాలెం మాజీ సర్పంచ్ పరుచూరి పూర్ణచంద్రరావు, జన చైతన్య సమితి కార్యదర్శి తుల్లూరి సాంబశివరావు, సిహెచ్సి స్టాఫ్ నర్స్ పూదట లిల్లీ రోజు రాణి, జన చైతన్య సమితి కోఆర్డినేటర్ వెలితోటి అనిల్ కుమార్, మన్నవ శ్రీబాల హర్ష తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీలకు భోజనంతో పాటు, కోడిగుడ్లు డ్రై ఫ్రూట్ లడ్లు, వేరుశనగ విత్తనాల లడ్లు, మామిడికాయలు, అరటి పండ్లను పంపిణీ చేశారు.