పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే వారి లక్ష్యమా…..?

0
411


పేద విద్యార్థులు డాక్టరలుగా తయారైతే కార్పోరేట్ హాస్పిటల్స్ మరుగున పడతాయనే చంద్రబాబు కుట్ర…

పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయ్యాలనే కుట్రలో భాగమే మెడికల్ కాలేజీలు ప్రైవేటికరణ..

నవతరం, కాకినాడ: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర పన్నడమే కాకుండా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేపట్టిందని ప్రత్తిపాడు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరి ఆరోపించారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై ముద్రగడ నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం రౌతులపూడి, మండలాలు ఏలేశ్వరం పట్టణంతో పాటు సుమారు 58410 సంతకాలు సేకరించామన్నారు. సేకరించిన సంతకాలను మండల కన్వీనర్ ల సమక్షంలో కాకినాడ జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా పరిపాలన సాగిస్తుందని విమర్శించారు. దానిలో భాగంగా వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. కోటి సంతకాల సేకరణకు సహకరించిన వైసిపి నాయకులకు, కార్యకర్తలకు ప్రజలకు ముద్రగడ గిరి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సేకరించిన సంతకాలు తరలించే వాహనానికి మాజీ మంత్రి వైసిపి రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఒమ్మి రఘురాం, తుని నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి జమీలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి. రాష్ట్ర వైసిపి యువజన విభాగం కార్యదర్శి బదిరెడ్డి గోవిందు, జెడ్పిటిసిలు గొల్లు చినదివాణం, బెహరా రాజేశ్వరి, ప్రత్తిపాడు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుడాల వెంకటరత్నం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి, మండలాలతో పాటు ఏలేశ్వరం రూరల్ మండలం వైసిపి అధ్యక్షులు రామిశెట్టి నాని, గొల్లపల్లి సురేష్, నరాల శ్రీను, సిహెచ్ సత్యన్నారాయణ, శిగడం వెంకటేశ్వరరావుతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..