హీరోయిన్ అంటే నాలుగైదేళ్లు ఇండస్ట్రీలో ఉంటే ఔట్‌డేటెడ్. కొత్త గ్లామర్‌కోసం వెతుకులాటలో ఎవరయినా సైడైపోవాల్సిందే. కానీ దాదాపు పదిహేనేళ్లుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది శ్రియ. అమ్మడు పెళ్లిపీటలెక్కుతుందనే ప్రచారం ఎప్పట్నించో నడుస్తోంది. టాలీవుడ్‌లో కొందరు హీరోలతో ఎఫైర్ నడుస్తోందనే పుకార్లే కాదు.. నిజమేనా అన్న డౌటొచ్చేలా చెట్టపట్టాలేసుకుని తిరిగిన కొన్ని ఫొటోలూ బయటికొచ్చాయి. ఓన్లీ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వచ్చిన శ్రియ మొత్తానికి మూడుముళ్లేయించుకుంది.
వయసుమీదపడ్డా అరకిలో కూడా పెరక్కుండా గ్లామర్‌ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన శ్రియ మొత్తానికి రష్యా కుర్రోడిని పెళ్లాడేసింది. రష్యాకి చెందిన ఆండ్రీ కొశీవ్‌ని పెళ్లిచేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో ముంబైలో జరిగిందీ పెళ్లి వేడుక. 12నుంచే మొదలైన పెళ్లి సందడి 17, 18, 19 తేదీల్లో మూడు రోజుల వేడుకగా సాగిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు పెళ్లి మ్యాటర్‌ని చివరిదాకా సీక్రెట్‌గా ఉంచడమే అసలు పాయింట్.
శ్రియ-ఆండ్రీకొశీవ్ పెళ్లి ఫొటోలు, వీడియోలు మంగళవారం బయటికి రావటంతో టాలీవుడ్ ఆశ్చర్యపోయింది. తెలుగు ఇండస్ట్రీతో ఇంత అనుబంధమున్న శ్రియ మాటమాత్రమైనా ఎవరికీ చెప్పలేదు. కొన్నాళ్లుగా ప్రేమలో పడ్డ ఈ జంట మొత్తానికి మాంగల్యబంధంతో ఒక్కటైంది. శ్రియ ప్రేమ తన లైఫ్‌నే మార్చేసిందంటున్నాడు కొశీవ్. అతను టెన్నిస్ ప్లేయర్. పైగా బిజినెస్‌మ్యాన్. 
వీరిద్దరి పెళ్ళికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

