


నవతరం, ప్రత్తిపాడు: పోతులూరు గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్య ప్రభ ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ముద్రించి ఇవ్వడంతో అనేక విమర్శలు వచ్చాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల బొమ్మలు తొలగించి ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పినట్లుగా ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను
రైతులకు అందిస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ఇచ్చిన టాక్టర్ ను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయుకులు మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబి), రామిశెట్టి కామేశ్, శెట్టి గంగబాబు, అధికారి, వెంకన్న బాబు, వల్లూరి పవన్ కళ్యాణ్, నాగులాపల్లి సూరిబాబు, పంచాది చంటిబాబు పార్టీ శ్రేణులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

