రంభ రీఎంట్రీ ఎప్పుడో తెలుసా?

0
350

అందం, అభినయంతో టాలీవుడ్‌నే కాకుండా కోలీవుడ్‌ని కూడా మెప్పించింది అందాలతార రంభ. పేరుకు తగ్గట్లే సిల్వర్‌స్క్రీన్‌ని వన్నెతెచ్చింది. పెద్దపెద్ద హీరోలతో నటించి లక్షలమంది అభిమానుల్ని సంపాదించుకుంది. 1990లలో కొన్నేళ్లలోనే పాపులర్‌ హీరోయిన్‌గా ఎదిగిన రంభ..రజనీకాంత్‌, కమల్‌హాసన్‌‌, చిరంజీవి, విజయ్‌, అజిత్‌, కార్తిక్‌, ప్రభులాంటి పెద్ద హీరోలతో నటించింది.

15 ఏళ్ల క్రితమే నటనకు బ్రేక్‌ ఇచ్చిన రంభ పెళ్లి తర్వాత భర్త, పిల్లలతో కెనడాలో సెటిలైపోయింది. పలు కారణాలతో మళ్లీ చెన్నైకి తిరిగొచ్చిన రంభ..కొన్ని టీవీ కార్యక్రమాల్లో జడ్జిగా కనిపించి వీక్షకుల్ని అలరించింది. మళ్లీ వెండితెరపై మనసు పారేసుకున్న బెజవాడ బ్యూటీ..మంచి అవకాశాలు దొరికితే ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకుంటోంది.

సాధారణంగా సీనియర్‌ నటీమణులు రీ ఎంట్రీ ఇస్తే హీరోహీరోయిన్ల తల్లి కేరక్టర్లలోనే ఎక్కువగా కనిపిస్తారు. కానీ రంభ మాత్రం అందుకు భిన్నమైన పాత్రలో కనిపించబోతోందని సమాచారం. తాజాగా ఓ సినిమాలో నటించడానికి రంభం అంగీకరించిందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే అది ఎలాంటి పాత్రనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరో పక్క తనకు స్టార్‌డమ్‌ తీసుకొచ్చిన టాలీవుడ్‌లోనూ ఛాన్సుల కోసం రంభ ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.