
రంగు మారుతుందా జాతీయ జెండా….
మానవ హక్కుల దినోత్సవం శుభాకాంక్షలు…
మృగ్యమవుతున్న మానవ హక్కులు…
రంగు మారుతుందా జాతీయ జెండా….
దారి తప్పుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ….
నేడు పెట్టుబడిదారులకు ప్రాధాన్యత…
పరిపాలనలో కనిపించని ప్రజాస్వామ్యము…రాజ్యాంగ సూత్రాలు….
మితిమీరి విజృంభిస్తున్న రాజకీయ పార్టీల ప్రాధాన్యత పాలనలో…
ఏకపక్షానికే పరిపాలనలో ప్రజా ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత…
ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం అనే ఓటు హక్కు పౌరుని చేతి నుండి చేజారుతుంది….
వ్యతిరేక శక్తులు నక్సలైట్లు అనే పేరుతో ఆదివాసీల కనీస రక్షణ కోసం హక్కుల కోసం పోరాడేవారు రానున్న రోజులలో కాగడా పెట్టి వెతికిన బహుశా కానరారేమో…..
ప్రజా రక్షణ శాఖ/ పోలీసు వ్యవస్థ పౌరుల యోగక్షేమాలు/రక్షణ కంటే సంబంధిత పాలక పక్షాల సేవకు మాత్రమే అధిక ప్రాధాన్యత….
పెరుగుతున్న అక్రమాలు దోపిడీలు మానభంగాలు హింసవాదం…
సామాన్యుల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయి.
ఆకాశాన్ని తాకుతున్న అధిక ధరలు పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆర్థిక వ్యవస్థ, తరుగుతున్న సామాన్యుల జీవన ప్రమాణాలు వారి స్థితిగతులు. క్రమ క్రమంగా అంతరించిపోతున్న ప్రభుత్వ రంగం. ప్రజాధనంతో అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారులు పరోక్షముగా వారే ప్రజాస్వామ్య పాలకులకు రక్షణ కవచాలు…
త్వరలో ప్రజాస్వామ్య ముసుగు కూడా తొలగిపోయిన ఆశ్చర్యము లేదేమో అనే ఆందోళన కలుగుతుంది అంటున్న అభ్యుదయవాదులు, మేధావులు ప్రజాసంఘాలు ఇప్పటికే వాక్ స్వాతంత్ర్యం సన్నగిల్లింది. “ఫోర్త్ ఎస్టేట్ మీడియా” ముసక బారింది కులం మతం అనే కాంక్రీట్గోడలు ఏర్పాటు చేస్తూ ప్రజలను విడదీస్తున్నటువంటి పరిస్థితులు నేడు బలముగా నున్నవి ఫెడరల్ వ్యవస్థకు ముప్పువాటిల్లే పరిస్థితులు కళ్ళు ఎదుట గోచరిస్తున్నవి.
ప్రజల మధ్య ఐక్యత దెబ్బతిని వివిధ రూపాలలో వారి భావాలు ప్రాంతీయ అసమానతలకు చోటు కల్పిస్తున్నవి. పాలకులు కుల మతాలతోనూ పాలన పరమైన విషయాలలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా కాకుండా వివక్షతతో పాలన ముందుకు సాగుతూ ఉండడం వలన తద్వారా ప్రజలలో ఐక్య మత్యం దెబ్బతిని విద్వేషాలు పెరిగి సాంప్రదాయాలకు ఆత్మీయత అభిమానలకు దూరముగా ఉండడం వలన ప్రశాంతత కొరవడి నేడు దేశంలోనే కాదు క్షేత్రస్థాయి నుండి దేశ రాజధాని వరకు ఎక్కడ చూసినా ప్రశాంత వాతావరణము కనిపించడం లేదు అన్నది జగమెరిగిన సత్యం. అభివృద్ధి పేరుతో పాలకపక్షాలు పరిపాలనా పరమైన ఖర్చులను విలాసవంతముగా శృతి మించి ఖర్చుపెట్టడం దుబారావలన నేడు సామాన్యుల నెత్తిన భరించరాని భారాలు అప్పులు తప్పవు అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆశిద్దాం రానున్న కాలంలోనైనా ప్రజా ప్రభుత్వాలు ప్రజాస్వామ్య హక్కులను కాపాడి రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా జాతీయ జెండా నీడలో ప్రతి ఒక్కరికి న్యాయం ధర్మం పరిపాలన అని కూడా కుల మత రాజకీయాలకు అతీతంగా దేశ సంపదను కాపాడుతూ పౌర హక్కులకు భంగం కలగకుండా ముందుకు సాగుతాయని.

