బిసిలకు చేయూతనిస్తున్న వైసీపీకి అండగా నిలుద్దాం…

0
27

నవతరం, రావులపాలెం: వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా ముందుకు తీసుకువెల్లిందని, ఆ పార్టీకీ వెన్నుదన్నుగా నిలబడవాల్సిన బాధ్యత బీసీ లందరిపైనా ఉందని రావులపాలెం జెడ్పిటిసి కుడిపూడి శ్రీనివాస్ అన్నారు. ఈనెల 7న విజయవాడలోని ఇందిరాగాంధీ పేరేల్ గ్రౌండ్లో వైఎస్సార్ సీపీ నిర్వహిస్తోన్న బిసి మహాసభ పోస్టర్ ను ఆదివారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓట్ల కోసం వాడుకున్నాయన్నారు. ఒక్క వైసీపీయే బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకువెల్లిందన్నారు. అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బిసిలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని, నియోజకవర్గంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బిసిలకు కేటాయించడం జరిగిందన్నారు. అటువంటి పార్టీకి ప్రతీఒక్క బిసి సోదరుడు వెన్నుదన్నుగా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే ఎన్నికల్లో కలసికట్టుగా పార్టీ విజయానికి పనిచేయాలన్నారు. 7న విజయవాడలో జరిగే బిసి మహాసభకు కొత్తపేట నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున బీసీలు తరలివెళ్లాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి.వెంకట లక్ష్మీ, బొక్కా కరుణాకరం, మట్టా బాబ్జి సత్యవేణి, దొమ్మేటి అర్జునరావు, కోట విజకుమారి, పాల నాగేశ్వరరావు, యణమాదల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.