ప్రజల పక్షాన నిలవడమే జర్నలిస్టు లక్ష్యం కావాలి ….!..

0
147

సామాజిక చైతన్యం తీసుకొచ్చే బాధ్యత జర్నలిస్టులుదే …..!..

రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు…..!

నవతరం, శ్రీకాకుళం: ప్రజల పక్షాన నిలవడమే జర్నలిజం లక్ష్యం కావాలని, ప్రజలలో సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఆధారపడి ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, వైయస్సార్సీపి రాష్ట్ర నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు తలగాపు వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు, ఆయన్ని దుశ్యాలువా కప్పి గౌరవంగా ధర్మాన ప్రసాదరావు సత్కరించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం జర్నలిజం రంగంలో కొనసాగుతూ కొన్ని సామాజిక విలువలకు గౌరవం ఇస్తూ.. తన వంతు బాధ్యతగా కొంచెం కష్టమైనా అక్షర ఉద్యమంలో సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్న సీనియర్ జర్నలిస్టు తలగాపు వెంకటరమణ సేవలు ప్రశంసనీయమన్నారు. తన సుదీర్ఘ జర్నలిజం జీవితంలో వ్యక్తుల మెప్పు పొందడానికి, కీర్తి కాంత కానుకలను వెనకేసుకోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా గాని, అటువంటి ప్రలోభాలకు లొంగకుండా, జర్నలిజం విలువలకు, నిబద్ధతకు కట్టుబడి, తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని కాపాడుకుంటూ రావడం ఆశ మసి వ్యవహారం కాదని, దీని వెనక ఎంతో క్రమశిక్షణ, దీక్ష దాగి ఉందన్నారు. వార్త, ప్రజాశక్తి, విశాలాంధ్ర దినపత్రికలతో పాటు వివిధ చిన్న, మధ్య తరహా పత్రికల్లో పనిచేస్తూ, ఈ ప్రాంత ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పాలకులతో పాటు ప్రతిపక్షాలు దృష్టికి తీసుకు వచ్చే కథనాలను అందిస్తూ.. వస్తున్న జర్నలిస్టు తలగాపు వెంకటరమణ భవిష్యత్తులో కూడా మరెన్నో వ్యాసాలు, కథనాలు రాస్తూ.. ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకురావడానికి కృషి చేయాలని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నేతలు అందవరపు సూరిబాబు, కేఎల్ ప్రసాద్, నక్క రామరాజు తదితరులు పాల్గొన్నారు.