
కూటమి పాలనపై ప్రజా వ్యతిరేక వెల్లువ…అంబెద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జగ్గరెడ్డి.
నవతరం, రావులపాలెం; రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లివిరుస్తోందని అందుకు ఉదాహరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమమే నిదర్శనమని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ప్రతులను బుధవారం రావులపాలెంలో జెండా ఊపి జిల్లా కేంద్రానికి తరలించారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని నేతలను జగ్గిరెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. పేదలకు వైద్యంతోపాటు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీ లను తీసుకొచ్చే కార్యక్రమం చేయబడితే దాన్ని కూటమి ప్రభుత్వం తన బినామీ దారులకు దోచిపెడుతోందని ఆయన దుయ్యబట్టారు. సంపద సృష్టిస్తానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు 30 వేల కోట్ల ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారని జగ్గిరెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు పని చేసిన ముఖ్యమంత్రులందరూ కలిసి 12 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి తన హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగిందన్నారు. ఇవి అన్నీ ప్రారంభిస్తే పేదలకు వైద్యం, వైద్య వైద్య అందుబాటులోకి వచ్చేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఉద్దేశంతో వీటిని తన అనునాయులకు దోచిపెడుతున్నారని జగ్గిరెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రం తెలంగాణలో 373 మార్కులు సాధిస్తే మెడికల్ సీట్ వస్తుందని అదే ఆంధ్రప్రదేశ్ లో 400 మార్కులు సాధించినా సీటు లేదన్నారు. ఇప్పటికే విద్యను కొనుక్కునేగా చేశారని ఇప్పుడు వైద్యాన్ని కూడా కొనుక్కునేలా చంద్రబాబు చేస్తున్నారని జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ప్రసాదాన్ని కూడా తన రాజకీయానికి వాడుకుంటున్నారని తిరుపతి ప్రసాదంలో మాటల ద్వారా కల్తీని కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని చిర్ల ఆరోపించారు. తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు మొట్టిన ఆయనకు బుద్ధి రాలేదన్నారు. తిరుమల తిరుపతి ప్రతిష్టను కూడా చంద్రబాబు నాయుడు బ్రస్టు పట్టించారన్నారు. తల్లి చేలో మేస్తే దూడ గట్టుమీద మేయ్యదు కదా! అన్న చందాన అదే విధంగా ఇక్కడ వాడపల్లి క్షేత్రాన్ని బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పునరావస కేంద్రంగా మార్చివేశారన్నారు. దేవుని సొమ్ము అవినీతి చేస్తూ పప్పు బెల్లాల దోచిపెడుతున్నారని జగ్గిరెడ్డి ఆరోపించారు. కొందరైతే దర్శనానికి పోన్ పై చేయించుకొని దర్శనం చేయిస్తున్నారని ఆరోపించారు. వాడపల్లి విషయంలో ఎన్ని తప్పులు జరుగుతున్నా ప్రతిష్టను పాడు చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ఆచితూచి మాట్లాడుతున్నానని జగ్గారెడ్డి అన్నారు వాడపల్లి ఆదాయాన్ని టిడిపి కార్యకర్తల ఖజానాగా మార్చేసారని ఆయన ఆరోపించారు దీనిపై విచారణ జరిపించాలన్నారు. తమ పాలనలో అభివృద్ధి కమిటీలో అన్ని కులాలకు ప్రాధాన్యతను ఇచ్చామని అలాగే అవినీతి జరక్కుండా చూసామని ఆయన అన్నారు. బండారు సత్యానందరావు కమిటీ సభ్యులు కూడా అమ్ముకున్నారని జగ్గిరెడ్డి ఆరోపించారు. వైసిపి చేసిన అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పేర్లు పెట్టుకోవడానికి సిద్ధమయ్యిందన్నారు. ఈ సమావేశంలో రావులపాలెం జడ్పిటిసి కుడిపూడి శ్రీనివాసరావు, మార్గాని గంగాధరరావు,తమ్మున్న శ్రీనివాస్, గొల్లపల్లి డేవిడ్ రాజు, సాకా ప్రసన్న కుమార్, కర్రి నాగిరెడ్డి నియోజకవర్గంలోని పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

