అయ్యో పాపం..నిజంగానా?

0
734

ఒక్క కంటిచూపుతో కోట్ల మంది అభిమానుల హృద‌యాల్ని కొల్ల‌గొట్టేసింది. చ‌క్క‌నైన వేళ్ల‌నే గ‌న్నులా మార్చి యూత్ గుండెల్లో తూటాలు దించేసింది. సిన్మా రిలీజ్ కాక‌ముందే దేశ‌వ్యాప్తంగా బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకుని రాత్రికిరాత్రే టాప్ సెల‌బ్రిటీగా మారిపోయిన పాప‌కి సొంతింట్లో ఫ్రీడం లేదంటే న‌మ్మ‌గ‌ల‌మా!?.

కేర‌ళ కుట్టి ప్రియావారియ‌ర్‌కి ఇంటా బయటా స్వేచ్ఛ లేకుండా పోయిందట. ఎవ‌రో అన్లేదు. త‌నే చెప్పుకుని బాధ‌ప‌డుతోందీ మాట‌. ప్రియావారియ‌ర్ చ‌దువుకునే కాలేజీలో డ్రెస్‌కోడ్ ఉంది. అది తప్ప వేరే డ్ర‌స్సులేమీ వేసుకోవ‌డానికి వీల్లేదు. అంతేనా..మొబైల్ కూడా వాడ‌కూడ‌దు. స‌రే..కాలేజీ అన్నాక స‌వాల‌క్ష రూల్స్. ఇంట్లోన‌న్నా నీకు న‌చ్చిన‌ట్లు ఉండొచ్చుగా అంటే..అంత సీన్లేదంటోంది గ‌న్నులాంటి క‌న్నులున్న పిల్ల‌.

తను ఎవరితోనైనా మాట్లాడాలన్నా మదర్‌ ఫోన్‌ నుంచే మాట్లాడాలి. చివ‌రికి ఫోన్‌ ఇవ్వడానికి కూడా మా పేరెంట్స్ అస్స‌లు ఒప్పుకోరంటోంది ప్రియావారియ‌ర్‌. మరో మూడేళ్లు త‌న‌కీ రూల్స్ త‌ప్ప‌వ‌ని చిర్రుబుర్రులాడుతోంది చార‌డేసి క‌ళ్ల పిల్ల‌. ఫ్యామిలీ మెంబ‌ర్స్ పెట్టే రూల్స్ ఒక్కోసారి విసుగు పుట్టించినా, అదంతా తన మంచికోసమేన‌ని స‌ర్దుకుపోతోంద‌ట బ్యూటిఫుల్ బేబీ.

,