అప్పుల్లోనే కూటమి ప్రభుత్వం దూకుడు…..!..

0
209

జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది…..?..

సూపర్ సిక్స్ హామీలకు పాతర….!.. పలాస ఎమ్మెల్యే నోట అభివృద్ధి మంత్రం….!..

టిడిపి పలాస పట్టణ నేతలు మాత్రం భూసూపర్ సిక్స్ హామీలకు పాతర….!.. పలాస ఎమ్మెల్యే నోట అభివృద్ధి మంత్రం….!.. కబ్జాలు, చెరువుల ఆక్రమణలు, మద్యం అధిక ధరల తో బిజీ బిజీ…..!…

నవతరం: పలాస: జగనన్న చేపట్టనున్న మరో ప్రజా సంకల్ప యాత్రకు ఎదురుచూస్తున్న ప్రజానీకం …..!.. వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు…..!.. అప్పులు చేయకుండా సంపద సృష్టించి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ సారధి చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం ఇష్టానుసారం అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పులు కూపంగా మార్చేసారని వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు అన్నారు. సోమవారం ఆయన పలాసలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ఇంతవరకు సుమారు రూ. 3 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. కేవలం 18 నెలల్లో రూ 2.66 లక్షల కోట్లు అప్పుచేసి సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని రుణాంద్రప్రదేశ్ గా మార్చేసారని బమ్మిడి దుర్యోధనరావు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు లో 80 శాతం అని, సంపద సృష్టి అంటే ఇదేనా? అని నిలదీశారు. నాడు వైఎస్ జగన్ పాలనలో అప్పులపై అడ్డగోలు ఆరోపణలు చేస్తూ.. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ గోబెల్స్ ప్రచారం చేశారని, ఇప్పుడు చంద్రబాబు పాలనలో సగటున రోజుకు రూ.500 కోట్లు అప్పు చేస్తుంటే.. రాష్ట్రం దివాలా తీస్తున్న విషయం కూటమి ప్రభుత్వ పాలకులకు తెలియదా ? అంటూ ఆయన ప్రశ్నించారు. ఎక్సైజ్ బాండ్లతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.5, 490 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. భవిష్యత్తు ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. నాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో ఏపీబీసీ ఎల్ ద్వారా అప్పు చేస్తే.. గగ్గోలు పెట్టిన టిడిపి నేతలు, కోర్టులో కేసులు వేశారని, కేంద్రానికి ఫిర్యాదులు చేశారని, నాడు తప్పు అయితే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఒప్పు అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. నాడు అప్పులు చేసి అందుకు అనుగుణంగా నేరుగా ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చిన హామీ మేరకు అర్హత ప్రామాణికముగా ఇవ్వడం జరిగిందని అదేవిధంగా నాడు నాడు నేడు ద్వారా వేలాది పాఠశాలలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులను కల్పించి అభివృద్ధి చేయడం జరిగిందని నాలుగు పోర్టులు, పది జెట్టీలు తదితర మరియు వేలాది దాచవాలయ భవనాలు ఆరోగ్య కేంద్రాలు పశు వైద్య కేంద్రాలు ఎన్నెన్నో మరెన్నో మెడికల్ కాలేజీలు తదితర అభివృద్ధి కార్యక్రమాలలో కొన్నింటిలో దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలోనూ భారతదేశంలోని ఐదవ స్థానంలోనూ కఠినమైన కరోనా కాటు వేసిన సందర్భంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆదుకున్న నాటి ప్రభుత్వమని ఆ అభివృద్ధిని నేడు పేర్లు మార్చి ఓపెనింగ్ చేస్తూ గ్లోబల్ ప్రచారాన్ని చేసుకుంటున్న కూటమి సర్కారు తీరు హస్యాస్పదమని ఆయన దుయ్యబెట్టారు.నేడు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా పూర్తి శాతం న్యాయంగా ఇవ్వటం లేదని, నేటి ప్రభుత్వం సంక్షేమ పెన్షన్ వేయి రూపాయలు పెంచి లక్షలాదిమంది పెన్షనర్లకు తొలగించి మొండి చేయి చూపుతూ కుంటి సాకులను చెప్పడం షోషనీయం అని వాపోయారు. చంద్రబాబు సృష్టిస్తానన్న సంపద మాటేమో గానీ రుణ సృష్టికర్త కర్తగా నిలుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పేకాట, మట్టి, కంకర, ఇసుక, మద్యం మాఫియాలే కొనసాగుతున్నాయని బహుశా సంపద సృష్టి అంటే నాయకులకు ఆర్థిక తోడ్పాటును వనరులు ద్వారా దోచుకోవడమేమో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అప్పులు అక్రమాలు, దౌర్జన్యాలతో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన సాగుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా తాము మోసపోయామని బాధపడుతున్నారని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమన్నారు. సూపర్ సిక్స్ వాగ్దానాలను అమలు చేయకుండా వాటిని పాతర వేసి ప్రజలను మోసం చేసిందన్నారు. మకర సంక్రాంతి పండగ చేసుకుందామన్న గాని నిత్యవసర వస్తువులు ధరలు బాగా పెరిగి పోయినాయి ఆకాశాన్ని తాకుతున్నాయని అని, సామాన్యుల బ్రతుకు భారముగా నడుస్తుందని వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం అయిందన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రోజురోజుకు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు. మళ్లీ మరో ప్రజా సంకల్ప యాత్రకు సిద్ధమవుతున్న వైఎస్ఆర్సిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాకకు ప్రజలు ఎదురుచూస్తున్నారని బమ్మిడి దుర్యోధనరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అలాగా ఉంటే.. పలాస నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పలు అభివృద్ధి కార్యక్రమాలపై.. అభివృద్ధి మంత్రం జపిస్తున్నప్పటికీ, ఆ పార్టీలో కొందరు సీనియర్ నేతలు తమసొంత అభివృద్ధి కోసం మద్యం మాఫియా, కంకర అక్రమ తవ్వకాలు, చెరువు గర్భాల ఆక్రమణలే ఎజెండాగా చేసుకొని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలి అన్నట్లుగా.. అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అన్న చందంగా వ్యవహరిస్తున్నారని బమ్మిడి దుర్యోధనరావు ఆరోపించారు. ఇటీవల పలాస – కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల జగన్నాథ సాగరం ఆక్రమణలకు గురవుతున్న తీరుపై వైఎస్ఆర్సిపి నేత రాష్ట్ర మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్వయంగా భూకబ్జాలకు పాల్పడిన ప్రాంతాలను ఆయన పరిశీలించడం జరిగిందన్నారు. పలాస అభివృద్ధి అంటూ ఎమ్మెల్యే జపం చేస్తుంటే.. ఇంకోపక్క టిడిపిలో ఉన్న మున్సిపాలిటీకి చెందిన ఒక ముఖ్య నేత మద్యం మాఫియాతో పాటు భూకబ్జాలకు పాల్పడుతున్న తీరుపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలంటూ ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న పలాస లో రోజురోజుకు పెరుగుతున్న భూకబ్జాలు, కంకర మాఫియా, మద్యం మాఫియా, చెరువుల గర్భాలు ఆక్రమణలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఈ విషయంలో ప్రజల తరఫున వైయస్సార్సీపి రాజీలేని పోరాటం చేస్తుందని బమ్మిడి దుర్యోధన స్పష్టం చేశారు. వేచి చూడాలి ప్రకటనలకు వాస్తవాలకు ఉన్న తేడాను సరిచేసి ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తారని.